The GOAT Box Office Collections: తొలి రోజే రూ.126 కోట్లు.. దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కొత్త రికార్డు
The GOAT Box Office Collections: దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లలో దుమ్మురేపింది. గురువారం (సెప్టెంబర్ 5) ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.
The GOAT Box Office Collections: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా తొలి రోజు వసూళ్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్ లభించాయి. తొలి రోజే రూ.126 కోట్లు వసూలు చేసినట్లు ది గోట్ మూవీ మేకర్స్ వెల్లడించారు. విజయ్ కెరీర్లో తొలి రోజే రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన రెండో సినిమాగా నిలిచింది.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కలెక్షన్లు
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా.. ఓపెనింగ్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. ఈ మూవీ తొలి రోజే రూ.126 కోట్లు వసూలు చేసినట్లు ప్రొడక్షన్ హౌజ్ వెల్లడించగా.. ఆ ట్వీట్ ను డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా షేర్ చేశాడు. దళపతి విజయ్ నటించిన లియో మూవీ కూడా తొలి రోజే రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది.
ఇప్పటి వరకూ కోలీవుడ్ లో తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా లియో నిలవగా.. ఇప్పుడీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రెండో స్థానంలో ఉంది. తమిళ సినిమాలో విజయ్ కి ఉన్న క్రేజ్ ఏంటో ఈ రెండు సినిమాల ద్వారానే అర్థమవుతోంది.
తమిళనాడులో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీకి రూ.31 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ రాష్ట్రంలో తొలి రోజే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఈ మూవీది నాలుగో స్థానం. అంతకుముందు మూడు సినిమాలు కూడా విజయ్ నటించినవే. బీస్ట్, లియో, సర్కార్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎలా ఉందంటే?
విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు వచ్చిన ఈ మూవీపై కోలీవుడ్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో ది గోట్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.
ది గోట్ మూవీకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా విజయ్ డ్యూయల్ రోల్‌లో నటించాడు. మీనాక్షి చౌదరి, స్నేహా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో త్రిష ఐటెంసాంగ్ చేసింది. ప్రశాంత్, ప్రభుదేవా, జయరామ్‌తో పాటు పలువురు సీనియర్ యాక్టర్స్ కీలక పాత్రల్లో నటించారు.
ఇదీ ది గోట్ స్టోరీ
తండ్రిపై పగను పెంచుకున్న ఓ కొడుకు కథతో దర్శకుడు వెంకట్ ప్రభు ది గోట్ సినిమాను రూపొందించాడు. గాంధీ (దళపతి విజయ్) యాంటీటెర్రరిస్ట్ స్క్వాడ్‌లో పనిచేస్తుంటాడు. తన జాబ్ గురించి భార్య అను ( స్నేహ) దగ్గర గాంధీ దాచిపెడతాడు.
ఓ సీక్రెట్ మిషన్‌లో జరిగిన ఎటాక్‌లో కొడుకు జీవన్‌ను (విజయ్)కోల్పోతాడు గాంధీ. భర్త జాబ్ వల్లే కొడుకు చనిపోయాడనే కోపంతో గాంధీకి దూరంగా వెళ్లిపోతుంది అను. కొడుకు దూరమైన బాధలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జాబ్ వదిలేస్తాడు గాంధీ. ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ గా పనిచేయడం మొదలుపెడతాడు.
పదిహేనేళ్ల తర్వాత చనిపోయాడని అనుకున్న కొడుకు జీవన్‌ను అనుకోకుండా గాంధీ కలుస్తాడు. జీవన్ తిరగొచ్చిన తర్వాత గాంధీ లైఫ్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. అతడి సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు.
ఈ హత్యలు చేస్తుంది ఎవరు? గాంధీ తలపెట్టిన ఓ సీక్రెట్ మిషన్ నుంచి ప్రాణాలతో బయటపడిన మీనన్(మోహన్)అతడిపై రివేంజ్ తీర్చుకోవానికి ఎలాంటి ప్లాన్ వేశాడు? తాను వెతుకుతున్న శత్రువు కొడుకు జీవన్ అని తెలిసి గాంధీ ఏం చేశాడు? అన్నదే ఈ మూవీ కథ.