The Goat Life Twitter Review: ఆడు జీవితం ట్విట్టర్ రివ్యూ - పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందటే?
28 March 2024, 10:48 IST
The Goat Life Twitter Review: పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) శుక్రవారం పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైంది. ఈ సర్వైవల్ డ్రామా మూవీకి బ్లెస్సీ దర్శకత్వం వహించాడు.
పృథ్వీరాజ్ సుకుమారన్
The Goat Life Twitter Review: పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ది గోట్‌లైఫ్ (ఆడుజీవితం) గురువారం మలయాళం, తెలుగు భాషలతో పాటు పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజైంది. ఈ సర్వైవల్ డ్రామా మూవీకి బ్లెస్సీ దర్శకత్వం వహించాడు. అమలాపాల్ హీరోయిన్‌గా నటించింది. పదహారేళ్ల క్రితం 2008లో అనౌన్స్ అయిన ఈ మూవీ ఎన్నో అవాంతరాలను దాటుకొని ఎట్టకేలకు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్స్, టీజర్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ మూవీ ఎలా ఉంది? సలార్ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్‌కు మరో హిట్ దక్కిందా లేదా? ....
నజీబ్ ప్రయాణం…
జీవనోపాధిని వెతుక్కుంటూ కేరళ నుంచి అరబ్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి కథతో దర్శకుడు బ్లెస్సీ ఈ మూవీని రూపొందించాడు. అరబ్ ఏడారుల్లో నజీబ్ ప్రయాణం ఎలా సాగింది? అతడు ఎదుర్కొన్న కష్టాలేమిటన్నది గోట్ లైఫ్‌లో దర్శకుడు సహజంగా ఆవిష్కరించాడని ఆడియెన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
పృథ్వీరాజ్ లుక్....
నజీబ్ పాత్రకు పృథ్వీరాజ్ ప్రాణంపోశాడని చెబుతున్నారు. అతడి లుక్, ట్రాన్స్‌ఫర్మేషన్స్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ పండించిన ఎమోషన్స్, యాక్టింగ్ మనసుల్ని కదలిస్తాయని అంటున్నారు. నజీబ్ క్యారెక్టర్ తప్ప సినిమాలో పృథ్వీరాజ్ ఎక్కడ కనిపించడని చెబుతున్నారు.
పదహారేళ్ల కష్టం...
పాత్ర కోపం పదహారేళ్లు అతడు పడిన కష్టం ప్రతి సీన్‌లో కనిపిస్తుందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఇలాంటి కథను నమ్మి సినిమా చేయడానికి చాలా ధైర్యం కావాలని అంటున్నారు. ఈ సినిమాకుగాను పృథ్వీరాజ్‌కు నేషనల్ అవార్డు రావడం గ్యారెంటీ అని చెబుతున్నారు. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు పృథ్వీరాజ్ క్యారెక్టర్‌తో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారని కామెంట్స్ చేస్తుంది.
బెస్ట్ సర్వైవల్ మూవీ...
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వైవల్ డ్రామా మూవీ ఇదని చెబుతున్నారు. ది గోట్ లైఫ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచిందని నెటిజన్లు అంటున్నారు. విజువల్స్, ఏడారిలో షూట్ చేసిన సీన్స్ చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయని చెబుతున్నారు.
మాస్టర్ పీస్ మూవీ…
అమలాపాల్‌ది చిన్న పాత్రే అయినా తన యాక్టింగ్‌తో అదరగొట్టిందని నెటిజన్లు పేర్కొన్నారు. ఓ పాటలో పృథ్వీరాజ్, అమలాపాల్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో మాస్టర్ పీస్ మూవీ ఇదని అంటున్నారు.
బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఆడుజీవితం మూవీ రూపొందింది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు జిమ్మి జీన్ లూయిస్ కీలక పాత్ర పోషించాడు.తెలుగులో ది గోట్ లైఫ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేసింది.