The Goat Life first reviews: ది గోట్ లైఫ్ ఓ అద్భుతం: పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీపై కమల్ హాసన్, మణిరత్నం ప్రశంసలు-the goat life first reviews kamal haasan maniratnam praised prithviraj sukumaran movie aadujeevitham movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Goat Life First Reviews: ది గోట్ లైఫ్ ఓ అద్భుతం: పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీపై కమల్ హాసన్, మణిరత్నం ప్రశంసలు

The Goat Life first reviews: ది గోట్ లైఫ్ ఓ అద్భుతం: పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీపై కమల్ హాసన్, మణిరత్నం ప్రశంసలు

Hari Prasad S HT Telugu

The Goat Life first reviews: పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)మూవీపై కమల్ హాసన్, మణిరత్నం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మూవీ అద్భుతమని కొనియాడారు.

ది గోట్ లైఫ్ ఓ అద్భుతం: పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీపై కమల్ హాసన్, మణిరత్నం ప్రశంసలు

The Goat Life first reviews: తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న మరో మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ది గోట్ లైఫ్ (ఆడుజీవితం). పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా శుక్రవారం (మార్చి 29) థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తెలుగు, తమిళ సినీ ప్రముఖులు ఈ సినిమా ప్రివ్యూలు చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆడుజీవితం అద్భుతం

ఆడుజీవితం అనే నవల ఆధారంగా ఈ ది గోట్ లైఫ్ మూవీ తెరకెక్కింది. కేరళకు చెందిన ఓ వలస కూలీ నజీబ్ నిజ జీవితంలో జరిగిన ఘటననే సినిమాగా తీశారు. ఇందులో ఆ నజీబ్ పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించాడు. బ్లెస్సీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2008లో అనుకుంటే.. మొత్తానికి 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈమధ్యే ది గోట్ లైఫ్ మూవీ చూసిన తమిళ స్టార్ నటుడు కమల్ హాసన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇదొక అద్భుతమైన సినిమా, ప్రేక్షకులు ఆదరించాలని అతడు కోరాడు. "బ్లెస్సీ హార్డ్ వర్క్ కు నేను థ్యాంక్స్ చెప్పాల్సిందే. నిజ జీవితంలో జరిగిన కథ ఇది. మణిరత్నం మూవీ చూసి ఈ పనితీరుకు ఆశ్చర్యపోయాడు.

ఇంటర్వెల్ సీన్ తర్వాత దాహం తీర్చుకోవడానికి బాగా నీళ్లు తాగాలని అనిపిస్తుంది. ఇందులో ఓ భిన్నమైన సినిమా తీయాలన్న నీ దాహం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా పృథ్వీరాజ్ స్నానం చేసే సీన్. నువ్వు ఇంత బాగా తీస్తావని ఊహించలేదు. అద్భుతమైన సినిమా. ప్రేక్షకులు కూడా ఆదరించాలి" అని కమల్ హాసన్ అన్నాడు.

ఇక మూవీకి పని చేసిన కెమెరా మ్యాన్ పైనా కమల్ ప్రశంసలు గుప్పించాడు. అటు దిగ్గజ దర్శకుడు మణిరత్నం కూడా ఈ సినిమాపై స్పందించాడు. "ఇది అద్భుతం. ఊపిరి బిగపట్టి చూసే సినిమా. మొత్తం విజువల్స్ అన్నీ. పృథ్వీరాజ్ చాలా బాగా చేశాడు. మొత్తం టీమ్ అసలు ఎలా చేశారో అర్థం కావడం లేదు. నీమీద అసూయ ఏమీ లేదు కానీ.. దీని వెనుక చాలా కష్టం ఉండొచ్చు" అని మణిరత్నం అన్నాడు.

ది గోట్ లైఫ్ మూవీ ఏంటి?

డైరెక్టర్ బ్లెస్సీ ది గోట్ లైఫ్ మూవీపై 16 ఏళ్లు పని చేశాడు. 2008లో అనుకొని మొదలు పెడదామనుకునే సమయానికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. మొత్తానికి 2018లో అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత కొవిడ్ కారణంగా మళ్లీ అడ్డంకులు ఏర్పడ్డాయి. మలయాళంలో బెస్ట్ సెల్లింగ్ నవల అయిన ఆడుజీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

సౌదీ అరేబియాలోని ఎడారిలో కేరళకు చెందిన నజీబ్ అనే వలస కూలి బానిసగా మారి పడిన ఇబ్బందులను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. గత వారమే ఈ సినిమా చూసిన నజీబ్ కూడా చాలా అద్భుతంగా తీశారంటూ కొనియాడాడు. ఈ సినిమా కోసం తాను చాలా శ్రమించానని, 31 కిలోల బరువు తగ్గినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పాడు.