Balakrishna Prithviraj Sukumaran: బాలకృష్ణతో ఓ మలయాళీ కమర్షియల్ మూవీ చేస్తాను: పృథ్వీరాజ్ సుకుమారన్-prithviraj sukumaran wants to direct balakrishna in malayali commercial movie aadujeevitham ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Balakrishna Prithviraj Sukumaran: బాలకృష్ణతో ఓ మలయాళీ కమర్షియల్ మూవీ చేస్తాను: పృథ్వీరాజ్ సుకుమారన్

Balakrishna Prithviraj Sukumaran: బాలకృష్ణతో ఓ మలయాళీ కమర్షియల్ మూవీ చేస్తాను: పృథ్వీరాజ్ సుకుమారన్

Hari Prasad S HT Telugu
Mar 27, 2024 09:15 PM IST

Balakrishna: మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బాలకృష్ణతో తాను ఓ మలయాళీ కమర్షియల్ మూవీ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పడం విశేషం.

బాలకృష్ణతో ఓ మలయాళీ కమర్షియల్ మూవీ చేస్తాను: పృథ్వీరాజ్ సుకుమారన్
బాలకృష్ణతో ఓ మలయాళీ కమర్షియల్ మూవీ చేస్తాను: పృథ్వీరాజ్ సుకుమారన్

Balakrishna: ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) మూవీతో మలయాళంతోపాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ ప్రమోషన్లలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. బాలక‌ృష్ణ మూవీకి దర్శకత్వం వహించాలన్న తన కోరికను బయటపెట్టాడు. అది కూడా రెగ్యులర్ మూవీ కాకుండా.. మలయాళీ కమర్షియల్ మూవీ తీయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

బాలకృష్ణతో పృథ్వీరాజ్ మూవీ

ఆడుజీవితం మూవీ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని కోల్పోయినట్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే చిరు కాకుండా టాలీవుడ్ లో తాను ఎవరిని డైరెక్ట్ చేయాలనుకుంటున్నాడో తాజాగా అతడు చెప్పాడు. ప్రభాస్, బాలకృష్ణతో తాను సినిమాలు చేయాలని అనుకుంటున్నట్లు సుకుమారన్ చెప్పాడు.

బాలయ్యతో ఓ రియలిస్టిక్ మూవీ తీయాలని ఉందని అన్నాడు. "నిజానికి బాలకృష్ణ సర్ తో రియలిస్టిక్ ఫిల్మ్ తీయాలని ఉంది. అది ఓ సాధారన కమర్షియల్ సినిమాలాగా ఉండకూడదు. అది కచ్చితంగా ఓ రియలిస్టిక్ మలయాళీ కమర్షియల్ మూవీగా ఉండాలి. బ్రో డాడీలాంటి సినిమా. బాలకృష్ణ సర్ మామూలుగా పెద్ద కమర్షియల్ సినిమాలు చేస్తారు. ఈ మధ్యే నేను ఆయనతో దీనిపై చర్చించాను" అని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించాడు.

మలయాళీ కమర్షియల్ మూవీ అంటూ పృథ్వీరాజ్ చెప్పిన విషయం బాలయ్య అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. నిజానికి తమ అభిమాన హీరోని ఫక్తు కమర్షియల్ సినిమాల్లోనే చూడాలిన వాళ్లు భావిస్తారు. కానీ సుకుమారన్ లాగా మలయాళీ రియలిస్టిక్ సినిమా అనేది మాత్రం కాస్త ఇంట్రెస్టింగే. అది కూడా ఓ టాప్ మలయాళ నటుడి డైరెక్షన్ లో కావడం విశేషం.

నిజానికి బాలయ్య మంచి నటుడు. కమర్షియల్ సినిమాలే కాదు.. ఎలాంటి సబ్జెక్ట్ అయినా చేయగలిగిన దిట్టే. నిజంగా పృథ్వీరాజ్ చెప్పినట్లు ఓ డిఫరెంట్ రియలిస్టిక సినిమా చేస్తే చూడాలని ప్రతి అభిమాని కోరుకుంటాడు. మరి అది సాధ్యమవుతుందా లేదా అన్నది చూడాలి.

ఆడుజీవితం మూవీ..

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) మూవీ శుక్రవారం (మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నజీబ్ అనే కేరళకు చెందిన ఓ వలస కూలీ సౌదీ అరేబియా ఎడారిలో ఓ బానిసలాగా గడిపిన జీవితాన్ని సినిమా రూపంలో తీసుకొస్తున్నారు. ఆడుజీవితం పేరుతో గతంలో నవల రాగా.. ఇప్పుడు దానినే తెరకెక్కించారు.

బ్లెస్సీ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూ షోలకు కమల్ హాసన్, మణిరత్నంతోపాటు తెలుగు దర్శకుల నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మరి ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి.

సౌదీ అరేబియాలోని ఎడారిలో కేరళకు చెందిన నజీబ్ అనే వలస కూలి బానిసగా మారి పడిన ఇబ్బందులను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. గత వారమే ఈ సినిమా చూసిన నజీబ్ కూడా చాలా అద్భుతంగా తీశారంటూ కొనియాడాడు. ఈ సినిమా కోసం తాను చాలా శ్రమించానని, 31 కిలోల బరువు తగ్గినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పాడు.

IPL_Entry_Point