తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases: ఈ వారం ఓటీటీల్లో టాప్ 7 రిలీజ్‍లు ఇవే.. ఒకే ప్లాట్‍ఫామ్‍లో మూడు

OTT Releases: ఈ వారం ఓటీటీల్లో టాప్ 7 రిలీజ్‍లు ఇవే.. ఒకే ప్లాట్‍ఫామ్‍లో మూడు

28 October 2024, 17:25 IST

google News
    • OTT Top Movies and Web Series this Week: ఓటీటీల్లోకి ఈ వారంలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. ఈ దీపావళి వారంలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ వారంలో ఓటీటీల్లో టాప్ రిలీజ్‍లు ఏవంటే..
OTT Movies This Week: ఈ వారం ఓటీటీల్లో టాప్ 7 రిలీజ్‍లు ఇవే
OTT Movies This Week: ఈ వారం ఓటీటీల్లో టాప్ 7 రిలీజ్‍లు ఇవే

OTT Movies This Week: ఈ వారం ఓటీటీల్లో టాప్ 7 రిలీజ్‍లు ఇవే

వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో అడుగుపెట్టేందుకు ఈ వారం (అక్టోబర్ 28 - నవంబర్ 3) కూడా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు రెడీ అయిపోయాయి. ఈ వారమే దీపావళి పండుగ కూడా ఉంది. ఈ తరుణంలో కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రెండు వెబ్ సిరీస్‍లకు రెండో సీజన్లు కూడా ఈ వారంలో అందుబాటులోకి రానున్నాయి. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే టాప్ 7 రిలీజ్‍లు ఏవో తెలుసుకోండి.

లబ్బర్ పందు

తమిళ స్పోర్ట్స్ డ్రామా మూవీ లబ్బర్ పందు ఓటీటీలోకి ఈ వారమే వచ్చేస్తోంది. అక్టోబర్ 31వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవనుంది. హరీశ్ కల్యాణ్, అట్టకత్తి దినేశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 30న థియేటర్లలో రిలీజై బ్లాక్‍బస్టర్ అయింది. దర్శకుడు తమిళరాసన్ పంచముత్తు ఈ లబ్బర్ పందు మూవీని తెరకెక్కించారు.

తంగలాన్

తంగలాన్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందని తెలుస్తోంది. అయితే, నెట్‍ఫ్లిక్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. తమిళ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు కోర్టు గ్రీన్‍ సిగ్నల్ ఇచ్చింది. దీపావళికి తంగలాన్ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు షెడ్యూల్ అయిందని నిర్మాత జ్ఞానవేల్ చెప్పారు.

కిష్కింద కాండం

మలయాళ సూపర్ హిట్ మూవీ కిష్కింద కాండం కూడా ఈ వారంలోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ చిత్రం నవంబర్ 1వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో ఆసిఫ్ అలీ, విజయ్ రాఘవన్ ప్రధాన పాత్రలు చేయగా.. దినిజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హాట్‍స్టార్ ఓటీటీలో తెలుగులోనూ వచ్చే అవకాశం ఉంది.

జోకర్ 2

జోకర్: ఫోలీ అడూ (జోకర్ 2) చిత్రం ఇండియాలో అక్టోబర్ 29వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్‍కు రానుంది. పాపులర్ మూవీ జోకర్ (2019)కు సీక్వెల్‍గా అక్టోబర్ 4న ఈ హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ విడుదలైంది. టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించిన ఈ జోకర్ 2లో జాక్విన్ ఫోనిక్స్ లీడ్ రోల్ చేశారు.

అర్థమైందా అరుణ్ కుమార్ 2

అర్థమైందా అరుణ్ కుమార్ తెలుగు వెబ్ సిరీస్ రెండో సీజన్ అక్టోబర్ 31వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సీజన్‍లో సిద్ధు పవన్, తేజస్వి మదివాడ, అనన్య శర్మ ప్రధాన పాత్రలు పోషించగా.. ఆదిత్య కేవీ దర్శకత్వం వహించారు. గత ఏడాది ఆహాలో అర్థమైందా అరుణ్ కుమార్ తొలి సీజన్ రాగా.. ఇప్పుడు అక్టోబర్ 31న రెండో సీజన్ అడుగుపెట్టనుంది.

మిథ్య: ది డార్క్ చాప్టర్

మిథ్య వెబ్ సిరీస్‍కు సీక్వెల్‍గా ‘మిథ్య: ది డార్క్ చాప్టర్’ వస్తోంది. ఈ సిరీస్ నవంబర్ 1వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీ, తెలుగు, తమిళంలో స్ట్రీమ్ అవుతుంది. ‘మిథ్య: ది డార్క్ చాప్టర్ సిరీస్‍లో హుమా ఖురేషి ప్రధాన పాత్ర పోషించగా.. కపిల్ శర్మ దర్శకత్వం వహించారు.

హార్ట్ బీట్

తమిళ వెబ్ సిరీస్ ‘హార్ట్ బీట్’ తెలుగులో వస్తోంది. ఈ వెబ్ సిరీస్ తెలుగులో అక్టోబర్ 30వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఈ మెడికల్ రొమాంటిక్ డ్రామా సిరీస్‍లో దీపా బాలు ప్రధాన పాత్రలో నటించారు.

ఈ రెండు తెలుగు సినిమాలు వస్తాయా!

సుధీర్ బాబు హీరోగా చేసిన మా నాన్న సూపర్ హీరో ఈ వారమే ఓటీటీలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. జీ5 ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. సుహాస్ హీరోగా చేసిన ‘జనక అయితే గనక’ సినిమా కూడా ఈ వారం ఆహా ఓటీటీలోకి వస్తుందనే రూమర్లు ఉన్నాయి. అయితే, ఈ చిత్రాల స్ట్రీమింగ్‍పై ఇంకా ప్రకటన రాలేదు. మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న, జనక అయితే గనక అక్టోబర్ 12న థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. మరి ఈ రెండు చిత్రాలు ఈ వారం ఓటీటీల్లోకి వస్తాయో లేకపోతే ఆలస్యమవుతాయో చూడాలి.

తదుపరి వ్యాసం