OTT Tamil Movie: ఓటీటీలో తెలుగులోనూ వస్తున్న తమిళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ ఇవే-harish kalyan tamil sports drama lubber pandhu to stream on disneyplus hotstar ott release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Tamil Movie: ఓటీటీలో తెలుగులోనూ వస్తున్న తమిళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ ఇవే

OTT Tamil Movie: ఓటీటీలో తెలుగులోనూ వస్తున్న తమిళ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 22, 2024 10:19 AM IST

Lubber Pandhu OTT Release Date: లబ్బర్ పందు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. గల్లీ క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ స్ట్రీమింగ్‍కు ఏ ప్లాట్‍ఫామ్‍లో రానుందో ఇక్కడ చూడండి.

Lubber Pandhu OTT: ఓటీటీలో తెలుగులోనూ వస్తున్న తమిళ క్రికెట్ బ్యాక్‍డ్రాప్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ ఇవే
Lubber Pandhu OTT: ఓటీటీలో తెలుగులోనూ వస్తున్న తమిళ క్రికెట్ బ్యాక్‍డ్రాప్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్ ఇవే

తమిళ స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘లబ్బర్ పందు’ సినిమా మంచి హిట్ అయింది. గల్లీ క్రికెట్ బ్యాక్‍డ్రాప్‍తో ఈ మూవీ రూపొందింది. హరీశ్ కల్యాణ్, అట్టకత్తి దినేశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. లబ్బర్ పందు చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.

ఓటీటీ డేట్ ఇదే

లబ్బర్ పందు చిత్రం డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో అక్టోబర్ 31వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. దీపావళి సందర్భంగా ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని హాట్‍స్టార్ ఓటీటీ నేడు (అక్టోబర్ 21) వెల్లడించింది. ఓ ప్రోమో తీసుకొచ్చి లబ్బర్ పందు చిత్రం అక్టోబర్ 31 స్ట్రీమింగ్‍కు వస్తుందని హాట్‍స్టార్ వెల్లడించింది.

ఐదు భాషల్లో..

లబ్బర్ పందు చిత్రాన్ని ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు హాట్‍స్టార్ ఓటీటీ ఖరారు చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ అక్టోబర్ 31న ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.

లబ్బర్ పందు మూవీకి తమిళరాసన్ పంచముత్తు దర్శకత్వం వహించారు. ఇద్దరు గల్లీ క్రికెటర్ల మధ్య ఈగో వల్ల గొడవలు రావడం, లవ్ స్టోరీ చుట్టూ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో హరీశ్ కల్యాణ్, అట్టకత్తి దినేశ్‍తో పాటు స్వస్తిక, సంజనా కృష్ణమూర్తి, బాల శరవణన్, కాళీ వెంకట్, గీతా కైలాసం, దేవ దర్శిని, జెన్సన్ దివాకర్ కీలకపాత్రలు పోషించారు.

లబ్బర్ పందు కలెక్షన్లు

లబ్బర్ పందు చిత్రం సుమారు రూ.42 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీ కేవలం రూ.5కోట్ల బడ్జెట్‍తోనే రూపొందింది. రూ.42 కోట్ల వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. ఈ మూవీని ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ కుమార్, వెంకటేశ్ నిర్మించారు.

లబ్బర్ పందు చిత్రానికి సీన్ రోల్డన్ సంగీతం అందించారు. దినేశ్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మదన్ గణేశ్ ఎడిటింగ్ చేశారు. సూపర్ హిట్ అయిన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూశారు. ఎట్టకేలకు అక్టోబర్ 31న హాట్‍స్టార్ ఓటీటీలో ఈ చిత్రం వస్తోంది.

పెరంబలూర్ ఊర్లో లబ్బర్ పందు చిత్రం సాగుతుంది. క్రికెట్ ఆడే పూనమలై అలియాజ్ గీతూ (అట్టకత్తి గణేశ్), అన్బు (హరిశ్ కల్యాణ్) మధ్య ఆటలో గొడవ జరుగుతుంది. ఇది పెద్దదవుతుంది. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. అయితే, గీతూ కూతురు దుర్గ (సంజన్ కృష్ణమూర్తి)ను అన్బు ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ మూవీలో ఉంటుంది.

కాగా, హాట్‍స్టార్ ఓటీటీలో గత వారం 1000 బేబీస్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లో నీనా గుప్తా, రహమాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠిలో స్ట్రీమ్ అవుతోంది.

Whats_app_banner