OTT Crime Thriller: ఓటీటీలో దూసుకొచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. టాప్‍లో ట్రెండింగ్.. ఏడు భాషల్లో స్ట్రీమింగ్
1000 Babies Web Series Streaming: ‘1000 బేబీస్’ వెబ్ సిరీస్ ఓటీటీలో ట్రెండింగ్‍కు వచ్చేసింది. ఏడు భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. ఒక్కరోజునే ఈ సిరీస్ ట్రెండింగ్‍లోకి దూసుకొచ్చింది.

‘1000 బేబీస్’ వెబ్ సిరీస్ మంచి అంచనాలతో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍పై మొదటి నుంచి ఆసక్తి నెలకొంది. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు క్యూరియాసిటీని పెంచింది. ఈ సిరీస్‍లో మలయాళ నటుడు రహమాన్, బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించారు. 1000 బేబీస్ వెబ్ సిరీస్ ఓటీటీలో మంచి ఆరంభాన్ని అందుకుంది.
ఒక్క రోజులోనే ట్రెండింగ్‍లోకి..
1000 బేబీస్ వెబ్ సిరీస్ ఈ శుక్రవారం అక్టోబర్ 18వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఒక్క రోజులోనే ఈ సిరీస్ హాట్‍స్టార్ ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది. వెబ్ సిరీస్‍ల్లో టాప్‍లో ప్రస్తుతం (అక్టోబర్ 19) ట్రెండ్ అవుతోంది. స్ట్రీమింగ్‍కు వచ్చిన ఒక్క రోజులోనే ఈ సిరీస్ ట్రెండింగ్‍లోకి దూసుకొచ్చింది.
ఏడు భాషల్లో స్ట్రీమింగ్
1000 బేబీస్ వెబ్ సిరీస్ మలయాళంలో రూపొందింది. అయితే ఈ సిరీస్ ఏడు భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠి, బెంగాలీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు హాట్‍స్టార్ ఓటీటీలో అడుగుపెట్టింది. పాజిటివ్ టాక్ రావటంతో పాటు ఏడు భాషల్లో స్ట్రీమ్ అవుతుండటంతో ఈ సిరీస్‍కు మంచి వ్యూస్ దక్కుతున్నాయి.
1000 బేబీస్ సిరీస్‍కు నజీమ్ కోయ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‍లో రహమాన్, నీనాతో పాటు సంజు శివమ్, జాయ్ మాథ్యూ, ఆదిల్ ఇబ్రహీం, ఆశ్విన్ కుమార్, దైన్ డేవిస్ కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍ను ఆగస్ట్ సినిమా పతాకంపై షాది నదేషన్ ఆర్య ప్రొడ్యూజ్ చేశారు.
1000 బేబీస్ సిరీస్‍కు సోషల్ మీడియాలో ఎక్కువగా పాజిటివ్ టాక్ వస్తోంది. ముఖ్యంగా ఈ సిరీస్‍లో నటీనటుల పర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. సస్పెన్స్, ట్విస్టులు కూడా ఎక్కువ భాగం వర్కౌట్ అయ్యాయని నెటిజన్లు పోస్టులు చేశారు. కొన్ని చోట్ల సాగదీత మినహా సిరీస్ అంతా గ్రిప్పింగ్‍గా ఉందని మరికొందరు రాసుకొచ్చారు.
వాళై మూవీ కూడా ట్రెండింగ్‍లో..
హాట్‍స్టార్ ఓటీటీలో తమిళ మూవీ ‘వాళై’ కూడా టాప్-3లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మూవీ అక్టోబర్ 11వ తేదీన హాట్‍స్టార్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. వాళై చిత్రంలో పోన్వెల్, రఘుల్, కలైయారాసన్, నిఖిల్, విమల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హిట్ అయింది. ఇప్పుడు వాళై చిత్రాన్ని హాట్‍స్టార్ ఓటీటీలో చూసేయవచ్చు.