Thalapathy Vijay GOAT OTT: రికార్డులు బ్రేక్ చేస్తున్న దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓటీటీ హక్కుల ధర
22 May 2024, 15:56 IST
- Thalapathy Vijay GOAT OTT: దళపతి విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఓటీటీ హక్కులను రికార్డు ధరకు అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శాటిలైట్ హక్కుల రూపంలోనూ ఈ మూవీ రికార్డులు బ్రేక్ చేసింది.
రికార్డులు బ్రేక్ చేస్తున్న దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓటీటీ హక్కుల ధర
Thalapathy Vijay GOAT OTT: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమాల్లో ఒకటి కావడంతో దీనికి ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓటీటీ
దళపతి విజయ్ నటిస్తున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ జానర్ లో వస్తున్న మూవీ. ఇందులో విజయ్ డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచీ దీనిపై ఎక్కడ లేని క్రేజ్ నెలకొంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ హక్కుల ధర విషయంలోనూ వస్తున్న వార్తలు షాకింగా ఉన్నాయి.
ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అయితే దీనికోసం ఆ ఓటీటీ ఏకంగా రూ.110 కోట్లు పెట్టినట్లు కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న మూవీయే అయినా.. ఈ స్థాయి ధర మాత్రం ఊహించనిదే. ఇప్పటికే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ ఏకంగా రూ.90 కోట్లకు కొనుగోలు చేసింది.
రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్
ఇలా దళపతి విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రిలీజ్ కు ముందే భారీ స్థాయిలో బిజినెస్ చేస్తోంది. శాటిలైట్, ఓటీటీ హక్కుల అమ్మకం ద్వారానే మేకర్స్ కు రూ.200 కోట్లు రావడం విశేషం. ఇక థియేట్రికల్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ సై-ఫి యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ ఒక యువకుడు, మధ్య వయస్కుడిగా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు.
యుక్త వయసు పాత్ర కోసం ఏఐ సాయంతో డీఏజింగ్ కూడా చేస్తున్నారు. దళపతి విజయ్ కెరీర్లో ఇది 68వ సినిమాగా రానుంది. ఇందులో విజయ్ తోపాటు ప్రభుదేవా, ప్రశాంత్, మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, జయారం, యోగి బాబులాంటి సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. ఇక మ్యూజిక్ ను యువన్ శంకర్ రాజా అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విజిల్ పోడు అనే సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెకండ్ సింగిల్ జూన్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
దళపతి విజయ్ దీంతోపాటు మరో సినిమా కూడా చేస్తున్నాడు. ప్రస్తుతానికి దళపతి69గా పిలుస్తున్నారు. కెరీర్లో అతనికి ఇదే చివరి సినిమా కావచ్చు. ఆ తర్వాత అతడు పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీని కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. విజయ్ చివరి సినిమాను వలీమై డైరెక్టర్ హెచ్ వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు.
టాపిక్