Netflix Crime Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న హాలీవుడ్ టాప్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే-best crime thriller movies on netflix these are the top 10 hollywood crime thrillers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Crime Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న హాలీవుడ్ టాప్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే

Netflix Crime Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న హాలీవుడ్ టాప్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే

Hari Prasad S HT Telugu
May 14, 2024 11:45 AM IST

Netflix Crime Thrillers: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో హాలీవుడ్ నుంచి వచ్చిన ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఏవో ఇక్కడ చూడండి.

నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న హాలీవుడ్ టాప్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే
నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న హాలీవుడ్ టాప్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే

Netflix Crime Thrillers: ఓటీటీల్లోకి హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌లో చాలా వరకు నెట్‌ఫ్లిక్స్ లోనే ఉన్నాయి. ఓటీటీల్లో ఈ క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు ఉండే డిమాండే వేరు. అన్ని జానర్ల కంటే ఈ జానర్ సినిమాలు చూసే వాళ్లే ఎక్కువగా ఉంటారు. మరి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం ఉన్న సినిమాల్లో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్ ఏవో ఇక్కడ చూడండి.

నెట్‌ఫ్లిక్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇవే

ది గుడ్ నర్స్

ఓ హాస్పిటల్లో నర్స్ గా పని చేస్తూ అక్కడి పేషెంట్లను చంపేసే ఓ సీరియల్ కిల్లర్ చార్లీ కలెన్ చుట్టూ తిరిగే క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఈ ది గుడ్ నర్స్. 2022లో వచ్చిన ఈ సినిమాకు ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ లో మంచి ఆదరణ లభిస్తోంది.

బేబీ డ్రైవర్

బేబీ డ్రైవర్ 2017లో వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఎడ్గార్ రైట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 34 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కగా.. బాక్సాఫీస్ దగ్గర 226 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. లేని శబ్దాలను వింటూ మ్యూజిక్ తోనే సాంత్వన పొందే ఓ డ్రైవర్.. ఓ దోపిడీలో పాల్గొనడం, తర్వాత జరిగే పరిణామాలతో ఈ బేబీ డ్రైవర్ మూవీ ఇంట్రెస్టింగా సాగుతుంది.

మిస్సింగ్

2018లో వచ్చిన సెర్చింగ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ మిస్సింగ్ మూవీ కూడా మంచి థ్రిల్ అందించేదే. కనిపించకుండా పోయిన తన తల్లిని కనిపెట్టడం కోసం ఓ కూతురు చేసే ప్రయత్నమే ఈ మిస్సింగ్ మూవీ.

ది కిల్లర్

డేవిడ్ ఫిచర్ డైరెక్ట్ చేసిన ది కిల్లర్ మూవీ గతేడాది థియేటర్లలోకి వచ్చింది. ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ఓ హత్య కోసం కొందరి దగ్గర డబ్బు తీసుకోవడం, తర్వాత ఆ హత్యలో భాగంగా జరిగిన తప్పిదంతో ఆ కిల్లరే ప్రమాదంలో పడటం, తర్వాత తనను చంపడానికి చూస్తున్న వారిని మట్టుబెట్టడం.. ఇలా ఈ క్రైమ్ థ్రిల్లర్ ఆసక్తికరంగా సాగిపోతుంది.

ది మ్యూల్

2018లో వచ్చిన హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. అదనపు సంపాదన కోసం డ్రగ్ కార్టెల్స్ తో చేతులు కలిపి ప్రమాదంలో పడే ఓ 90 ఏళ్ల వృద్ధుడి చుట్టూ తిరిగే కథే ది మ్యూల్. క్లింట్ ఈస్ట్‌వుడ్ ఈ మూవీలో నటించడంతోపాటు డైరెక్ట్ చేశాడు.

లక్కీయెస్ట్ గర్ల్ అలైవ్

జెస్సికా నాల్ లక్కీయెస్ట్ గర్ల్ అలైవ్ పేరుతోనే రాసిన నవల్ ఆధారంగా అదే పేరుతో తీసిన మూవీ ఇది. న్యూయార్క్ లో నివసించే ఓ జర్నలిస్టు.. ఓ హైస్కూల్లో జరిగిన విషాదంపై తీసే క్రైమ్ డాక్యుమెంటరీలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరతారు. ఆ తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.

ది స్ట్రేంజర్

ఓ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్, హంతకుడి చుట్టూ తిరిగే కథే ది స్ట్రేంజర్ మూవీ. మార్క్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ ఓ హంతకుడితో సన్నిహితంగా మారి.. అతడి ద్వారానే నిజం చెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆ హంతకుడితోపాటు తన జీవితం కూడా ప్రమాదంలో పడుతుంది. తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.

ఎమిలీ ది క్రిమినల్

తన అప్పుల భారం నుంచి బయటపడటానికి క్రెడిట్ కార్డ్ స్కామ్ చేసే ఓ కాలేజీ అమ్మాయి చుట్టూ తిరిగే కథతో ఆసక్తికరంగా సాగుతుంది ఎమిలీ ది క్రిమినల్ మూవీ. అయితే ఆ క్రెడిట్ కార్డ్ స్కామ్ ఎంత భయానకమైనదో తర్వాత ఆమె తెలుసుకుంటుంది.