Godzilla x Kong The New Empire OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ
Godzilla x Kong The New Empire OTT Streaming: హాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజై సంచలన విజయం సాధించిన గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఈ మూవీ చూడాలంటే మాత్రం భారీగా ఖర్చు పెట్టాల్సిందే.
Godzilla x Kong The New Empire OTT Streaming: హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మూవీ ఊహించని విధంగా ఓటీటీలోకి వచ్చేసింది. అయితే అప్పుడే దీనిని ఫ్రీగా చూసే అవకాశం లేదు. బుక్ మై షో యాప్ ద్వారా ఈ మూవీని స్ట్రీమింగ్ చేయొచ్చు. అయితే ఈ మూవీని కొనడం లేదా రెంట్ విధానంలో మాత్రమే చూసే వీలుంది.
ఓటీటీలోకి గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్
హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ న్యూ ఎంపైర్. ఈ సినిమా మార్చి 29న థియేటర్లలో రిలీజైంది. అయితే నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. మూవీ టికెట్స్ బుక్ చేసుకునే యాప్ బుక్ మై షో స్ట్రీమ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఈ సినిమా కోసం టికెట్లు కొనుగోలు చేసే అవకాశంతోపాటు అక్కడే స్ట్రీమింగ్ కు కూడా ఆ ఓటీటీ ఛాన్స్ ఇచ్చింది. అయితే దీని కోసం భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. రెంట్ విధానంలో అయితే 4కే క్వాలిటీలో స్ట్రీమింగ్ చేయడానికి రూ.549 చెల్లించాలి. అయితే కొనాలంటే మాత్రం రూ.799 తప్పదు. ఇంగ్లిష్ తోపాటు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో సినిమా అందుబాటులో ఉంది.
ఈ మూవీని రెంట్ కు తీసుకున్నా, కొనుగోలు చేసినా.. మొబైల్, వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ టీవీ, యాపిల్ టీవీ, ఫైర్ టీవీల్లో చూసే అవకాశం ఉంటుంది. ఈ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఇంకా థియేటర్లలో సత్తా చాటుతూనే ఉంది. ఐమ్యాక్స్ 3డీ వెర్షన్ తోపాటు 4డీఎక్స్, 3డీ, 2డీ వెర్షన్లలోనూ ఈ గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ న్యూ ఎంపైర్ మూవీ చూడొచ్చు.
గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ న్యూ ఎంపైర్ ఓటీటీ రిలీజ్ డేట్
నిజానికి ఈ గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ న్యూ ఎంపైర్ మూవీ ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ప్రైమ్ వీడియోతోపాటు యూట్యూబ్ లో మంగళవారం (మే 14) నుంచి అందుబాటులోకి రానుంది. అయితే వీటిలోనూ రెంటల్ విధానంలోనే చూసే వీలుంటుంది. ఈ సినిమాను 15 కోట్ల డాలర్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.
మార్చి 29న ఇండియాలో ఈ మూవీ రిలీజైంది. అదే సమయంలో బాలీవుడ్ లో క్రూ మూవీ కూడా రిలీజైంది. అయితే ఇక్కడి సినిమాల పోటీని తట్టుకుంటూ ఈ ఏడాది అత్యధిక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు సాధించిన హాలీవుడ్ మూవీగా ఈ గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ న్యూ ఎంపైర్ సినిమా నిలిచింది. ఈ మూవీ తొలి వీకెండ్ లోనే రూ.37.6 కోట్లు వసూలు చేయడం విశేషం.
గాడ్జిల్లా వెర్సెస్ కాంగ్ మూవీకి ఇది సీక్వెల్ గా వచ్చింది. ఇందులో గాడ్జిల్లా, కాంగ్ కలిసి భూమి ఎదుర్కొంటున్న సరికొత్త ముప్పు నుంచి రక్షించే ప్రయత్నం చేశాయి. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.52.4 కోట్ల డాలర్ల కలెక్షన్లను రావడం విశేషం. అంటే బడ్జెట్ కంటే ఇప్పటికే మూడు రెట్లకుపైగా వసూళ్లు వచ్చాయి.