Friday Theatre Releases: ఐదు తెలుగు సినిమాలతో పోటీ పడనున్న హాలీవుడ్ మూవీ.. ఎవరిదో పైచేయి?-friday theatre releases five telugu one hollywood movies at box office prathinidhi 2 kingdom of the planet of the apes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Friday Theatre Releases: ఐదు తెలుగు సినిమాలతో పోటీ పడనున్న హాలీవుడ్ మూవీ.. ఎవరిదో పైచేయి?

Friday Theatre Releases: ఐదు తెలుగు సినిమాలతో పోటీ పడనున్న హాలీవుడ్ మూవీ.. ఎవరిదో పైచేయి?

Hari Prasad S HT Telugu

Friday Theatre Releases: ఈ శుక్రవారం (మే 10) థియేటర్లలో ఆరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఐదు తెలుగు మూవీస్ కాగా.. ఒక హాలీవుడ్ మూవీ కావడం విశేషం.

ఐదు తెలుగు సినిమాలతో పోటీ పడనున్న హాలీవుడ్ మూవీ.. ఎవరిదో పైచేయి?

Friday Theatre Releases: ప్రతి శుక్రవారంలాగే ఈ వారం (మే 10) కూడా కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్నికలు, ఎండ వేడి, ఐపీఎల్ కారణంగా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ కు దూరంగా ఉంటున్నాయి. అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. తెలుగులో రిలీజ్ అవుతున్నవన్నీ చిన్న బడ్జెట్ సినిమాలే.

ఫ్రైడే బాక్సాఫీస్ ఫైట్

శుక్రవారం (మే 10) ఓటీటీ రిలీజ్ లలాగే థియేటర్లలోనూ నాలుగు కొత్త తెలుగు సినిమాలు, ఒక రీరిలీజ్ మూవీ, ఒక హాలీవుడ్ మూవీ పోటీ పడుతున్నాయి. అయితే తెలుగులో కొత్తగా వస్తున్న నాలుగు సినిమాలూ చాలా తక్కువ బడ్జెట్ మూవీసే కావడం విశేషం. నారా రోహిత్ నటించిన పొలిటికల్ డ్రామా ప్రతినిధి 2 ఇందులో ఒకటి. టీవీ5 మూర్తిగా పేరుగాంచిన దేవగుప్తపు మూర్తి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

నిజానికి రెండు వారాల కిందటే రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా వేశారు. ఇప్పుడు సరిగ్గా ఏపీలో ఎన్నికలకు మూడు రోజుల ముందు శుక్రవారం (మే 10) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఈ సినిమా ఓటర్లపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి.

ఇక సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ కూడా శుక్రవారమే (మే 10) రిలీజ్ కాబోతోంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని సమర్పిస్తున్నాడు. అనాథలుగా పెరిగిన ముగ్గురు అబ్బాయిల మధ్య బంధమే ప్రధాన కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇది కాకుండా ఓ థ్రిల్లింగ్ అడ్వెంచర్ మూవీ ఆరంభం, డబ్బింగ్ మూవీ సత్య కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల సూపర్ హిట్ మూవీ లీడర్ కూడా రీరిలీజ్ కానుండటం విశేషం. ఈ సినిమా ద్వారానే రానా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ కొత్త సినిమాల జాతరలో సైలెంట్ గా లీడర్ రీరిలీజ్ ఉండటం విశేషం.

హాలీవుడ్ నుంచి ఆ మూవీ

ఇన్ని తెలుగు సినిమాల మధ్య హాలీవుడ్ నుంచి ఒకే ఒక్క మూవీ రిలీజ్ కాబోతోంది. అయితే ఆ ఒక్క సినిమా నుంచే వీటన్నింటికీ ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే ఆ మూవీ మరేదో కాదు కింగ్‌డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఎ సెంటర్లలో ఈ సినిమాకు బుకింగ్స్ కూడా జరిగి పోయాయి. దీంతో ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో భారీ కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

నిజానికి ఈ వారం రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల కంటే ఈ హాలీవుడ్ మూవీయే ఎక్కువ వసూళ్లు రాబట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇప్పటికే అమెరికాలో రిలీజై మంచి టాక్ తెచ్చుకున్న మూవీ ఇది. ఇండియాలో మాత్రం ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. 2017లో వచ్చిన వార్ ఫర్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ వస్తోంది.