OTT Action Thriller: ఓటీటీలో సత్తాచాటుతున్న దళపతి విజయ్ చిత్రం.. ట్రెండింగ్‍లో టాప్‍కు దూసుకొచ్చిన మూవీ
05 October 2024, 14:34 IST
- The Greatest of All time OTT Streaming: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) చిత్రంలో ఓటీటీలో దుమ్మురేపుతోంది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ స్ట్రీమింగ్‍లో సత్తాచాటుతోంది. నేషనల్ వైడ్‍లో టాప్‍లో ట్రెండ్ అవుతోంది.
OTT Action Thriller: ఓటీటీలో సత్తాచాటుతున్న దళపతి విజయ్ చిత్రం.. ట్రెండింగ్‍లో టాప్‍కు దూసుకొచ్చిన మూవీ
‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (ది గోట్) మూవీ ఓటీటీలో హోరెత్తిస్తోంది. తమిళ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చినా.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో అనుకున్న స్థాయిలో ఈ చిత్రానికి కలెక్షన్లు రాలేదు. సెప్టెంబర్ 2న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సుమారు నెల తర్వాత ఓటీటీలోకి తాజాగా అడుగుపెట్టింది. ఓటీటీలో ఈ గోట్ చిత్రం సత్తాచాటుతోంది.
నంబర్ వన్ ప్లేస్‍లో..
‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‍టైమ్’ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో నంబర్ వన్ ప్లేస్‍కు దూసుకెళ్లింది. ఈ మూవీ ఈ గురువారం అక్టోబర్ 3న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఆరంభం నుంచి మంచి వ్యూస్ దక్కించుకుంది.
భారీగా వ్యూస్ వస్తుండటంతో నెట్‍ఫ్లిక్స్ ఇండియా మూవీస్‍లో ది గోట్ చిత్రం ప్రస్తుతం (అక్టోబర్ 5) టాప్‍లో ట్రెండ్ అవుతోంది. స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల్లోపే దూసుకొచ్చింది.
క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
ది గోట్ చిత్రం ఓటీటీలోకి డైరెక్టర్ కట్‍తో ఎక్కువ రన్‍టైమ్‍తో వస్తుందని రూమర్లు వచ్చాయి. స్వయంగా డైరెక్టర్ వెంకట్ ప్రభునే ఈ విషయం గతంలో చెప్పారు. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శించిన వెర్షనే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ విషయంపై వెంకట్ కూడా స్పందించారు. అదనపు సీన్లకు ఇంకా వీఎఫ్‍ఎక్స్ వర్క్ చాలా జరగాల్సి ఉందని, దీంతో భవిష్యత్తులో ఆ సీన్స్ వచ్చేలా నిర్మాతలతో మాట్లాడతానంటూ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వెర్షన్ ఎంజాయ్ చేయాలంటూ పేర్కొన్నారు. ఆశించినట్టు అదనపు సీన్లు లేకపోవడంతో కొందరు విజయ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీకి ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత కూడా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. విజయ్ యాక్టింగ్‍పై ప్రశంసలు వస్తున్నాయి. మూవీలోని కొన్ని సీన్లు చాలా బాగున్నాయంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే, ఈ చిత్రంలో వీఎఫ్‍ఎక్స్ గురించి కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్టోరీ బాగానే ఉన్నా.. దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించలేదనే కామెంట్లు వస్తున్నాయి.
ది గోట్ సినిమా సుమారు రూ.450 గ్రాస్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. దాదాపు రూ.400కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ నిర్మించింది.
గోట్ మూవీలో దళపతి విజయ్‍కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా చేశారు. ప్రశాంత్, ప్రభుదేవ, స్నేహ, మోహన్, జయరాం కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో విజయ్ రెండు పాత్రల్లో మెప్పించారు. వేరియేషన్స్ బాగా చూపించారు. అయితే, యంగ్ క్యారెక్టర్ కోసం వాడిన డీఏజింగ్ టెక్నాలజీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చారు. సిద్ధార్థ్ నూని సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి వెంకట్ రాజెన్ ఎడిటింగ్ చేశారు.
టాపిక్