తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Tv Shows Trp Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. మళ్లీ ఆ రియాల్టీ షోనే టాప్

Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. మళ్లీ ఆ రియాల్టీ షోనే టాప్

Hari Prasad S HT Telugu

24 September 2024, 13:31 IST

google News
    • Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. వరుసగా రెండో వారం కూడా అదే రియాల్టీ షో టాప్ లో నిలిచింది. ఇక ఎప్పటిలాగే టాప్ 10లో స్టార్ మా, ఈటీవీ ఛానెల్స్ కు చెందిన షోలే ఉండటం విశేషం.
తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. మళ్లీ ఆ రియాల్టీ షోనే టాప్
తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. మళ్లీ ఆ రియాల్టీ షోనే టాప్

తెలుగు టీవీ షోస్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే.. మళ్లీ ఆ రియాల్టీ షోనే టాప్

Telugu TV Shows TRP Ratings: తెలుగు టీవీ షోలకు సంబంధించి 37వ వారానికి టీఆర్పీ రేటింగ్స్ బయటకు వచ్చేశాయి. ఈ రేటింగ్సే అసలు తెలుగు ఛానెల్స్ లో ఎలాంటి షోలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారో చెప్పడానికి ప్రామాణికం. చాలా రోజులుగా వీటిలో స్టార్ మా, ఈటీవీ షోలే ఆధిపత్యం చెలాయిస్తుండగా.. ఈ వారం కూడా ఆ రెండు ఛానెల్స్ లో వచ్చే షోలే టాప్ 10లో ఉన్నాయి.

బిగ్ బాస్ తెలుగు 8 టాప్

బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన విషయం తెలుసు కదా. ఈ రియాల్టీ షో మొదలైనప్పటి నుంచీ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లోనే ఉంటోంది. తాజాగా 37వ వారం రేటింగ్స్ చూసుకుంటే.. బిగ్ వీకెండ్ షోకి అర్బన్, రూరల్ కలిపి ఏకంగా 5.55 రేటింగ్ రావడం విశేషం.

ఈ షోకి అర్బన్ ఏరియాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కేవలం వీకెండ్ అర్బన్ రేటింగ్ చూసుకుంటే 7.01గా ఉంది. ఇక రెండో స్థానంలో బిగ్ బాస్ వీక్ డేస్ షోలు ఉన్నాయి. ఈ రియాల్టీ షోకి అర్బన్, రూరల్ కలిప 4.09 రేటింగ్ వచ్చింది. కేవలం అర్బన్ లో 4.92గా ఉంది.

టాప్ 10లో ఉన్న షోలు ఇవే

వీటి తర్వాత కూడా స్టార్ మాలోనే వచ్చే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో 3.07 రేటింగ్ తో మూడో స్థానంలో ఉంది. ఇక ఒకప్పుడు టాప్ లో ఉన్న.. ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ షో 3.03తో నాలుగో స్థానానికి పడిపోయింది. గతంతో పోలిస్తే ఈ షో రేటింగ్స్ పడిపోయాయి. జీ తెలుగు షో డ్రామా జూనియర్స్ 2.97 రేటింగ్ తో ఐదో స్థానంలో ఉండగా.. ఈటీవీలో వచ్చే డ్యాన్స్ షో ఢీ సెలబ్రిటీ స్పెషల్ షో 2.91 రేటింగ్ తో ఆరో స్థానంలో ఉంది.

ఇక ఈటీవీలోనే వచ్చే మరో కామెడీ షో జబర్దస్త్ 2.84 రేటింగ్ తో ఏడో స్థానంలో ఉంది. మరో ఈటీవీ షో సుమ అడ్డా 2.34 రేటింగ్ తో ఎనిమిదో స్థానంలో, సింగింగ్ రియాల్టీ షో పాడుతా తీయగా 2.24తో తొమ్మిదో స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఈ తాజా రేటింగ్స్ లో ఈటీవీలో వచ్చే ఫ్యామిలీ స్టార్స్ షో రేటింగ్ మాత్రం ఇవ్వలేదు. నిజానికి ఈ షో కూడా టాప్ షోలలో ఒకటిగా ఉంటూ వస్తోంది.

క్రమంగా పడిపోతున్న బిగ్ బాస్

నిజానికి బిగ్ బాస్ తెలుగు 8 రియాల్టీ షో టాప్ లో ఉంటున్నా.. ఆ షో రేటింగ్స్ మాత్రం ప్రతి వారం పడిపోతూ వస్తోంది. ఈసారి షో అంతగా రక్తి కట్టడం లేదు. హౌజ్ లోకి వచ్చిన కంటెస్టెంట్లలో చాలా మంది పెద్దగా తెలియని వాళ్లే. దీనికితోడు హౌజ్ లో గొడవలు, ఒకరిపైకి మరొకరు దూసుకురావడాలు తప్ప పెద్ద ఇంట్రెస్టింగా సాగడం లేదు.

దీంతో తొలి వారం ఉన్న రేటింగ్స్ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ రేటింగ్స్ పెంచడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పేరుతో కొందరు సెలబ్రిటీలను పంపాలని స్టార్ మా నిర్ణయించింది. అది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

తదుపరి వ్యాసం