Telugu Movie OTT: నేరుగా ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ బాలుగాని టాకీస్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
22 July 2024, 15:51 IST
Aha OTT: కామెడీ డ్రామా కథాంశంతో తెరకెక్కుతోన్న తెలుగు మూవీ బాలుగాని టాకీస్ డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో శివరామచంద్రవరపు, శరణ్య శర్మ హీరోహీరోయిన్లుగా కనిపించబోతున్నారు.
ఆహా ఓటీటీ
Aha OTT: ఆహా ప్లాట్‌ఫామ్ నుంచి మరో కొత్త మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. బాలుగాని టాకీస్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఆఫీషియల్‌గా ఆహా ఓటీటీ సోమవారం ప్రకటించింది. కామెడీ డ్రామా (Comedy Drama) కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శివ రామచంద్రవరపు, శరణ్య శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు.
ఆగస్ట్‌లో రిలీజ్...
బాలుగాని టాకీస్ మూవీలో రఘు కుంచే, సుధాకర్‌రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి కీలక పాత్రలు పోషిస్తోన్నారు. ఈ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆహా ఓటీటీ ప్రకటించింది. ఆగస్ట్ సెకండ్ వీక్‌లో ఈ కామెడీ సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం.
జై బాలయ్య...
ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను ఆహా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నది. ఇందులో పాతకాలం నాటి సినిమా రీల్ బాక్స్, ప్రొజెక్టర్ కనిపిస్తోన్నాయి. రీల్ బాక్స్‌పై జై బాలయ్య అని రాసి ఉండటం ఆసక్తిని పంచుతోంది. పక్కనే హాలు నిండింది అనే బోర్డ్ కింద పడి ఉంది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌కు ఆదరణ ఉన్న కాలం నాటి రోజులను ఆవిష్కరిస్తూ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం.
పాత కాలం నాటి థియేటర్...
థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ లవ్ డ్రామాగా బాలుగాని టాకీస్ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం. బాలు వారసత్వంగా వచ్చిన పాతకాలం నాటి థియేటర్‌ను నడుపుతుంటాడు. బాలకృష్ణకు వీరాభిమాని అయిన బాలు తన థియేటర్‌లో ఎక్కువ అతడి సినిమాలనే ప్రదర్శిస్తుంటాడు.
థియేటర్‌నే నమ్ముకున్న బాలు జీవితం ఏమైంది? పాతకాలం నాటి థియేటర్‌ను పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు బాలు ఎలాంటి ప్లాన్స్ వేశాడు? అతడి లైఫ్‌లోకి ఓ అమ్మాయి ఎలా వచ్చింది అనే అంశాలతో ఈ మూవీ సాగనున్నట్లు సమాచారం. బాలుగాని టాకీస్ మూవీకి విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనిధి సాగర్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ మూవీకి స్మరణ్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. అశ్విత్ గౌతమ్ స్క్రీన్‌ప్లే అందిస్తోండగా ఆదిత్య బీఎన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చుతున్నాడు.
పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్‌లో..
శివ రామచంద్రవరపు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇదివరకు తెలుగులో పలు సినిమాలు చేశాడు. పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్, నితిన్ భీష్మ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, మిజిలీ, హిట్ 2 తో పాటు ఇరవైకిపైగా సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేశాడు. కొన్ని వెబ్ సిరీస్‌లలో కనిపించాడు. నరుడి బ్రతుకు నటన సహా మరికొన్ని చిన్న సినిమాల్లో హీరోగా కనిపించాడు శివ రామచంద్రవరపు.