కాలేయానికి మేలు చేసే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Jul 20, 2024

Hindustan Times
Telugu

శరీరంలో జీవక్రియలకు కాలేయం అతిముఖ్యమైన భాగం. ఇది ఆరోగ్యంగా ఉండటంలో ఆహారం కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాలేయానికి మేలు చేసే ఐదు రకాల ఆహారాలు ఇక్కడ చూడండి. 

Photo: Pexels

క్యాబేజీ, పాలకూర, కేల్, బ్రకోలీల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వ్యర్థాలు తొలగిపోయి కాలేయం క్లీన్‍గా ఉండేందుకు ఇవి సహాయపడతాయి. 

Photo: Pexels

బ్లూబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, స్ట్రాబెర్రీ, కాన్‍బెర్రీల్లో పోలిఫెనోల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాలేయ ఆరోగ్యాన్ని ఇవి సంరక్షించగలవు. 

Photo: Pexels

సాల్మన్, సార్డ్ నైస్, టునా చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కాలేయంలో కొవ్వు తగ్గడంలో ఇవి సహకరిస్తాయి. 

Photo: Pexels

గ్రీన్‍ టీలో కటేచిన్స్ అనే పవర్‌ఫుల్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. కాలేయ పనితీరును ఇవి మెరుగుపరుస్తాయి. రెగ్యులర్‌గా గ్రీన్ టీ తాగితే కాలేయానికి మేలు జరుగుతుంది. 

Photo: Unsplash

కాలేయం నుంచి వ్యర్థాలు తొలిగిపోయేలా బీట్‍రూట్ తోడ్పడుతుంది. రక్తనాళాలు మెరుగ్గా పని చేసేలా చేస్తుంది. తద్వారా కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. 

Photo: Pexels

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash