తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Tamannaah On Lust Stories 2: లస్ట్ స్టోరీస్ 2 చూసేటప్పుడు సడెన్‌గా ఎవరైనా వస్తే.. ఇలా చేయండంటున్న తమన్నా

Tamannaah on Lust Stories 2: లస్ట్ స్టోరీస్ 2 చూసేటప్పుడు సడెన్‌గా ఎవరైనా వస్తే.. ఇలా చేయండంటున్న తమన్నా

Hari Prasad S HT Telugu

27 June 2023, 20:50 IST

google News
    • Tamannaah on Lust Stories 2: లస్ట్ స్టోరీస్ 2 చూసేటప్పుడు సడెన్‌గా ఎవరైనా వస్తే.. ఇలా చేయండంటూ తమన్నా చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో ఓ కిస్ సీన్ వీడియోను కూడా ఆమె షేర్ చేసింది.
లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా, విజయ్ వర్మ
లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా, విజయ్ వర్మ

లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా, విజయ్ వర్మ

Tamannaah on Lust Stories 2: తమన్నా ఈ మధ్య వెబ్ సిరీస్ లలో రెచ్చిపోయి సెక్స్ సీన్లలో నటిస్తున్న సంగతి తెలుసు కదా. ప్రైమ్ వీడియోలో వచ్చిన జీ కర్దా వెబ్ సిరీస్ లో అలాంటి ఎన్నో సీన్లు ఉన్నాయి. ఇక ఇప్పుడు లస్ట్ స్టోరీస్ 2లోనూ తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో అలాంటి సీన్లలో చెలరేగిపోయింది. తాజాగా అలాంటి ఓ వీడియోనే ఆమె షేర్ చేస్తూ.. లస్ట్ స్టోరీస 2 చూసేటప్పుడు ఎవరైనా సడెన్ గా వస్తే భయపడిపోయి తీసేయకండి అని చెప్పడం విశేషం.

ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా తమన్నా ఈ వీడియో చేసింది. లస్ట్ అంటే కామం. అయితే ఈ సిరీస్ లో కామం ఒక్కటే కాదు.. ఇంకా చాలా ఉన్నాయ్.. ఫ్యామిలీతో కలిసి చూడండని తమన్నా చెబుతోంది. "లస్ట్ స్టోరీస్ 2లో డ్రామా, రొమాన్స్, యాక్షన్ ఉన్నాయి.

ఇందులో అమ్మ ప్రేమ, బామ్మ ప్రేమ, మాజీ లవర్ ప్రేమ, పని మనిషి ప్రేమ కూడా ఉన్నాయి. పేరు చూసి మోసపోకండి. అందరికీ చూపించండి. ఏమవుతుంది? తుఫానేమీ రాదు. ఆకాశం ఊడిపడదు. వైఫై బంద్ కాదు. కదా? రిలాక్స్ అవండి. లస్ట్ స్టోరీస్ 2 చూడండి" అని ఈ సిరీస్ ప్రోమోలో తమన్నా చెప్పింది.

అంతకుముందు విజయ్ వర్మతో తాను నటించిన సెక్స్ సీన్ వీడియో కూడా ఇందులో ఉంది. తన 18 ఏళ్ల కెరీర్లో ఇలాంటి ఇంటిమేట్ సీన్లకు దూరంగా ఉన్న తమన్నా.. సడెన్ గా తాను పెట్టుకున్న రూల్ ను పక్కన పెట్టి సెక్స్ సీన్లలో రెచ్చిపోతోంది. జీ కర్దా సిరీస్ లోనూ ఆమె ఇలాగే నటించింది. ఇప్పుడు లస్ట్ స్టోరీస్ లోనూ అదే చేయబోతోంది.

ఈ లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే జీ కర్దా వేరు ఈ లస్ట్ స్టోరీస్ 2 వేరు. ఎందుకంటే ఇందులో తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతోనే ఆమె రొమాన్స్ చేయబోతోంది. దీంతో ఫ్యాన్స్ ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తదుపరి వ్యాసం