తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Takkar Teaser: లవ్, సెక్స్, యాక్షన్.. సిద్ధార్థ్ టక్కర్ టీజర్ వచ్చేసింది

Takkar Teaser: లవ్, సెక్స్, యాక్షన్.. సిద్ధార్థ్ టక్కర్ టీజర్ వచ్చేసింది

Hari Prasad S HT Telugu

17 April 2023, 19:04 IST

    • Takkar Teaser: లవ్, సెక్స్, యాక్షన్.. అన్నీ కలిపితే సిద్ధార్థ్ టక్కర్ టీజర్. ఈ కోలీవుడ్ స్టార్ నటించిన లేటెస్ట్ మూవీ టీజర్ ను సోమవారం (ఏప్రిల్ 17) మేకర్స్ రిలీజ్ చేశారు.
టక్కర్ మూవీ
టక్కర్ మూవీ

టక్కర్ మూవీ

Takkar Teaser: ఒకప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ లలో టాప్ హీరోల్లో ఒకడిగా ఉన్న సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ టక్కర్. మహా సముద్రం తర్వాత అతడు నటించిన ఈ సినిమా టీజర్ సోమవారం (ఏప్రిల్ 17) రిలీజైంది. కార్తీక్ జీ క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా చాలా ఆలస్యమైంది. అయితే సిద్ధార్థ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొత్త ప్రయోగం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఏసీఈ

NNS May 18th Episode: పుట్టింటికి అరుంధతి.. సరస్వతిని చంపేస్తున్న మనోహరి.. అందరికీ తెలియనున్న నిజం​​​!

బోల్డ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న టాలీవుడ్ డైరెక్ట‌ర్ - ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్‌

ఈ టక్కర్ ఓ రొమాంటిక్ యాక్షన్ మూవీ. పేదవాడైన ఓ అబ్బాయి, ధనికురాలైన ఓ అమ్మాయి మధ్య జరిగే లవ్ స్టోరీ. ప్రేమను ఓ టైంపాస్ గా మాత్రమే ఆమె భావిస్తుంది. కానీ హీరో మాత్రం ఆమెను సీరియస్ గా ప్రేమిస్తుంటాడు. కావాలంటే నాతో సెక్స్ చెయ్ కానీ ఈ ప్రేమ అనే మాట వద్దు అంటూ హీరోయిన్ అంటుంది. టీజర్ లో వీళ్ల రొమాన్స్ తోపాటు ఫుల్ యాక్షన్ సీన్స్ చూడొచ్చు.

అయితే లవ్, సెక్స్, యాక్షన్ సీక్వెన్స్ ఉన్న ఈ టక్కర్ టీజర్ చూస్తే అసలు సినిమా కథ ఏంటి అన్నది పూర్తిగా అర్థం కావడం కష్టం. టీజర్ లోని విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగున్నాయి. సిద్ధార్థ్ స్టైలిష్ లుక్ లో కనిపించాడు. మైఖేల్ మూవీ ద్వారా ఫేమ్ సంపాదించిన దివ్యాన్షా కౌషిక్ ఈ టక్కర్ మూవీలో ఫిమేల్ లీడ్ గా కనిపిస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ నిర్మించిన ఈ టక్కర్ మూవీకి నివాస్ కే ప్రసన్న మ్యూజిక్ అందించాడు. మరోవైపు సిద్ధార్థ్ బర్త్ డే సందర్భంగా అతని గర్ల్ ఫ్రెండ్ అదితి రావ్ హైదరీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విషెస్ చెప్పింది. ఈ సందర్భంగా తమ విదేశీ టూర్ కు సంబంధించిన ఓ వీడియోను కూడా ఆమె పోస్ట్ చేయడం విశేషం.

మహా సముద్రం మూవీ షూటింగ్ లోనే సిద్ధార్థ్, అదితి మధ్య ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. ఈ మధ్య అదితి ఓటీటీల్లో బిజీ అయిపోయింది. జీ5లో తాజ్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూబ్లీ వెబ్ సిరీస్ లలో ఆమె నటించింది. జూబ్లీ సిరీస్ లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం