Siddharth Aditi dance: అదిరిపోయే స్టెప్పులేసిన సిద్ధార్థ్, అదితి.. ప్రేమపక్షుల డ్యాన్స్ రీల్ వైరల్-siddharth aditi dance on tum tum song going viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siddharth Aditi Dance: అదిరిపోయే స్టెప్పులేసిన సిద్ధార్థ్, అదితి.. ప్రేమపక్షుల డ్యాన్స్ రీల్ వైరల్

Siddharth Aditi dance: అదిరిపోయే స్టెప్పులేసిన సిద్ధార్థ్, అదితి.. ప్రేమపక్షుల డ్యాన్స్ రీల్ వైరల్

Hari Prasad S HT Telugu
Feb 27, 2023 08:47 PM IST

Siddharth Aditi dance: అదిరిపోయే స్టెప్పులేశారు సిద్ధార్థ్, అదితి. ఈ ప్రేమపక్షుల డ్యాన్స్ రీల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ వేల సంఖ్యలో కామెంట్లతో వీళ్ల వీడియోను ముంచెత్తుతున్నారు.

సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ
సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ

Siddharth Aditi dance: కోలీవుడ్ క్యూట్ కపుల్ సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ. ఈ ప్రేమ పక్షుల మధ్య ఏదో జరుగుతోందని చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఇక ఏమాత్రం పుకార్లు కావు. వీళ్లు పరోక్షంగా తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ను బయట పెట్టేస్తున్నారు. ఈ మధ్యే ఈ జంట లంచ్ డేట్ కు వెళ్లగా.. తాజాగా ఓ పాపులర్ పాటకు కలిసి స్టెప్పులేశారు.

ఇన్‌స్టా రీల్స్ కోసం సిద్ధార్థ్, అదితి ఇలా డ్యాన్స్ చేయడం విశేషం. అదితి ఇంట్లోనే వీళ్లు ఇలా మైమరచిపోయి స్టెప్పులేశారు. తమిళ పాపులర్ సాంగ్ టమ్ టమ్ పాటకు వీళ్లు డ్యాన్స్ చేశారు. విశాల్ నటించిన ఎనిమీ మూవీలోని సాంగ్ ఇది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సాంగ్ మ్యూజిక్ మంచి టాక్ కొట్టేసింది. ఇప్పుడు తాను సిద్ధార్థ్ తో కలిసి చేసిన ఈ డ్యాన్స్ వీడియోను అదితి షేర్ చేసుకుంది.

డ్యాన్స్ మంకీస్.. ద రీల్ డీల్ అనే క్యాప్షన్ తో అదితి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. వీడియో చాలా క్యూట్ గా ఉంది అంటూ చాలా మంది హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ చేశారు. ఈ మంకీలు చాలా క్యూట్ గా ఉన్నాయి అంటూ సోఫీ చౌదరి కూడా కామెంట్ చేయడం విశేషం.

ఇక వీళ్ల సినిమాల విషయానికి వస్తే అదితి నటించిన తాజ్ మూవీ త్వరలోనే జీ5 ఓటీటీలోకి రాబోతోంది. ఇక మరో మూవీ హీరామండి కూడా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. మరోవైపు సిద్ధార్థ్ చివరిసారి అదితితో కలిసి మహాసముద్రం మూవీలో నటించగా.. ఇప్పుడు కమల్ హాసన్ తో కలిసి ఇండియన్ 2లో నటిస్తున్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం