Divyansha Kaushik Dating Nagachaitanya: నాగ‌చైత‌న్య‌తో డేటింగ్ - క్లారిటీ ఇచ్చిన మ‌జిలీ హీరోయిన్‌-divyansha kaushik gives clarity on dating with naga chaitanya ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Divyansha Kaushik Gives Clarity On Dating With Naga Chaitanya

Divyansha Kaushik Dating Nagachaitanya: నాగ‌చైత‌న్య‌తో డేటింగ్ - క్లారిటీ ఇచ్చిన మ‌జిలీ హీరోయిన్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 30, 2023 11:40 AM IST

Divyansha Kaushik Dating Nagachaitanya: నాగ‌చైత‌న్య‌తో డేటింగ్‌లో ఉన్న‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల‌పై మ‌జిలీ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ స్పందించింది. మ‌జిలీ రిలీజ్ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌ను ఒక్క‌సారి కూడా క‌ల‌వ‌లేద‌ని అన్న‌ది.

నాగ‌చైత‌న్య‌, దివ్యాంశ కౌశిక్
నాగ‌చైత‌న్య‌, దివ్యాంశ కౌశిక్

Divyansha Kaushik Dating Nagachaitanya: మ‌జిలీ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్‌ నాగ‌చైత‌న్య‌తో డేటింగ్ చేస్తోన్న‌ట్లు కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌జిలీ సినిమాతోనే దివ్యాంశ కౌశిక్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌ను ప్రేమించే యువ‌తిగా క‌నిపించింది.

శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో నాగ‌చైత‌న్య‌, దివ్యాంశ కౌశిక్ త‌మ కెమిస్ట్రీతో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఈ సినిమాతో వీరిమ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌కు దారితీసిన‌ట్లు, నాగ‌చైత‌న్య‌తో దివ్యాంశ డేటింగ్‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ డేటింగ్ పుకార్ల‌పై మైఖేల్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో దివ్యాంశ స్పందించింది.

మ‌జిలీ సినిమా త‌ర్వాత నాగ‌చైత‌న్య‌తో తాను ట‌చ్‌లో లేన‌ని అన్న‌ది. ఈ డేటింగ్ వార్త‌ల‌ను తాను మొద‌టిసారి ఇప్పుడేవింటున్నాన‌ని తెలిపింది. న‌ట‌న‌లో త‌న‌కంటే నాగ‌చైత‌న్య సీనియ‌ర్ అని, న‌టుడిగా ఆయ‌న్ని గౌర‌విస్తాన‌ని అన్న‌ది. అంత‌కుమించి అత‌డితో ఎలాంటి రిలేష‌న్‌షిప్ లేద‌ని దివ్యాంశ కౌశిక్ చెప్పింది. మైఖేల్ సినిమాతో ఫిబ్ర‌వ‌రి 3న తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌నున్న‌ది దివ్యాంశ కౌశిక్‌.

సందీప్‌కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు రంజిత్ జ‌య‌కొడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం త‌మిళంలో సిద్ధార్థ్‌తో ఓ సినిమా చేస్తోంది దివ్యాంశ కౌశిక్‌. కాగా మజిలీ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా స‌మంత న‌టించింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.