OTT Survival Thriller: ఓటీటీలోకి వస్తున్న సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. జాంబీల నుంచి ఆ ఫ్యామిలీ తప్పించుకుంటుందా?
07 October 2024, 16:31 IST
- OTT Survival Horror Thriller Movie: ఔట్‍సైడ్ చిత్రం నేరుగా ఓటీటీలోకి రానుంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. జాంబీలతో ఈ మూవీ ఉండనుంది. స్ట్రీమింగ్ వివరాలివే..
OTT Survival Thriller: జాంబీల నుంచి ఆ ఫ్యామిలీ తప్పించుకుంటుందా? ఓటీటీలోకి వస్తున్న సర్వైవల్ థ్రిల్లర్ మూవీ
ఉత్కంఠభరితంగా ఉండే సర్వైవల్ థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీ భలే డిమాండ్ ఉంటుంది. ఈ జానర్‌లో చాలా సినిమాలు మంచి సక్సెస్ అయ్యాయి. భాషతో సంబంధం లేకుండా కొందరు సర్వైవల్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో ఈ జానర్లో ‘ఔట్‍సైడ్’ మూవీ వస్తోంది. హారర్ ఎలిమెంట్లతో ఈ సర్వైవల్ మూవీ ఉండనుంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్‍కు వస్తోంది.
ఫిలిప్పినోలో రూపొందిన ఔట్‍సైడ్ చిత్రం ప్రస్తుతానికి మూడు భాషల్లో అందుబాటులోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్ కూడా అధికారికంగా ఖరారైంది.
స్ట్రీమింగ్ వివరాలివే..
ఔట్‍సైడ్ సినిమా అక్టోబర్ 17వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి స్ట్రీమింగ్‍కు రానుంది. ఫిలిప్పినోతో పాటు ఇంగ్లిష్, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన వచ్చింది. ముందుగా ఔట్‍సైడ్ చిత్రాన్ని అక్టోబర్ 11న తీసుకురావాలని నెట్‍ఫ్లిక్స్ భావించింది. కాస్త ఆలస్యం అయింది. ఎట్టకేలకు అక్టోబర్ 17వ తేదీన ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.
ఔట్‍సైడ్ మూవీలో సిద్ లుసెరో, బ్యూటీ గోంజలెజ్, మార్కో మాసా, ఐడెన్ టైలర్, జోయెల్ టోర్రే ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కార్లో లడెస్మా దర్శకత్వం వహించారు. బ్లాక్‍క్యాప్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసింది.
స్టోరీలైన్ ఇదే
జాంబీలు విజృంభించడంతో ఓ పాతకాలం నాటి పాడుబడిన ఫామ్‍హౌస్‍కు ఓ కుటుంబం వెళుతుంది. అయితే, అక్కడ జాంబీలతో పాటు మరిన్ని ప్రమాదాలు వీరికి ఎదురవుతాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుంటారు. మరి వారు జాంబీల నుంచి తప్పించుకున్నారా? అక్కడ ఉన్న ప్రమాదాలు ఏంటి? దీని వెనుక రహస్యాలు ఏంటి? అనే విషయాల చుట్టూ ఔట్‍సైడ్ మూవీ సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీ ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది.
రీసెంట్‍గా ‘కంట్రోల్’
కంట్రోల్ (CTRL) చిత్రం గత వారమే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సైబర్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే లీడ్ రోల్ చేశారు. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. భవిష్యత్తులో మనుషుల జీవితాలపై ఏఐ టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం ఎంత తీవ్రంగా పెరుగుతుందనే అంశాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. కంట్రోల్ చిత్రానికి విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించారు.
కంట్రోల్ మూవీలో అనన్యతో పాటు విహాన్ సామ్రాట్ కూడా లీడ్ రోల్ చేశారు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. థ్రిల్లింగ్‍గా, గ్రిప్పింగ్‍గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.