OTT Thriller Movie: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన అనన్య పాండే సినిమా.. నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్
CTRL OTT Streaming: కంట్రోల్ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. నాలుగు భాషల్లో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ చిత్రానికి చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆ వివరాలు ఇవే..
కంట్రోల్ (సీటీఆర్ఎల్) సినిమాపై ట్రైలర్ నుంచి మంచి హైప్ ఏర్పడింది. ఈ థ్రిల్లర్ చిత్రంలో అనన్య పాండే ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. కంట్రోల్ చిత్రానికి విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించారు. సైబర్ థ్రిల్లర్‌గా డిఫరెంట్ పాయింట్‍తో ఈ మూవీని తెరకెక్కించారు. కంట్రోల్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
తెలుగులోనూ..
కంట్రోల్ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందుగా టీజర్, ట్రైలర్‌లను హిందీలో ఒక్కటే ఆ ఓటీటీ తీసుకొచ్చింది. దీంతో ఇతర భాషల డబ్బింగ్‍లో ఈ మూవీ వస్తుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే, హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రాన్ని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఈ శుక్రవారం స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చింది.
భవిష్యత్తులో ఏఐ టెక్నాలజీ, సోషల్ మీడియా మనుషులను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తాయో, ఎలా నియంత్రణలోకి తీసుకోగలవో అనే అంశంతో కంట్రోల్ సినిమాను డైరెక్టర్ విక్రమాదిత్య తెరకెక్కించారు. ఈ మూవీలో అనన్యతో పాటు విహాన్ సామ్రాట్ ప్రధాన పాత్ర పోషించారు. ఏఐ మనిషి జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది, కంట్రోల్‍లోకి ఎలా తీసుకుంది అనే అంశం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.
పాజిటివ్ రెస్పాన్స్
కంట్రోల్ సినిమాను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసిన చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. టెక్నాలజీతో ప్రైవసీకి ఉన్న ముప్పును ఈ సినిమాకు కళ్లకు కట్టిందని కొందరు పోస్టులు చేస్తున్నారు. ఈ చిత్రం థ్రిల్లింగ్‍గా, గ్రిప్పింగ్ నరేషన్‍తో మెప్పించిందని అంటున్నారు. డైరెక్టర్ విక్రమాదిత్య మోత్వానే ఈ మూవీని ఆలోచింపజేసేలా, ఉత్కంఠభరితంగా రూపొందించారని కామెంట్లు చేస్తున్నారు.
టెక్నాలజీతో భవిష్యత్తులో ప్రజల రిలేషన్ ఎలా ఉండనుందో కంట్రోల్ మూవీలో చూపించారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అనన్య పాండే ఈ మూవీలో పర్పార్మెన్స్ అదరగొట్టారని, ఆమె యాక్టింగ్ చాలా ప్లస్ అయిందంటూ అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా కంట్రోల్ మూవీకి అధిక శాతం పాజిటివ్ స్పందన వస్తోంది.
కంట్రోల్ సినిమాలో అనన్య పాండే, విహాన్ సహా దేవిక వస్తా, కామాక్షి భట్, సుచిత త్రివేది, రావిశ్ దేశయ్, సమిత్ గంభీర్ కీలకపాత్రలు పోషించారు. ఏఐ మనిషి అలెన్‍కు అపర్‌శక్తి ఖురానా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ మూవీని నిఖిల్ ద్వివేది, ఆర్యమీనన్ ప్రొడ్యూజ్ చేశారు. స్నేహ ఖన్వాల్కర్ సంగీతం అందించారు.
స్టోరీలైన్ ఇదే
సోషల్ మీడియా ఇన్‍ఫ్లయెన్సర్స్ అయిన నీలా (అనన్య పాండే), జాయ్ మస్కరేనస్ (విహాన్) ప్రేమించుకుంటారు. బిజినెస్‍లో భాగస్వాములుగానూ ఉంటారు. ఆన్‍లైన్‍లోనే చాలా సెలెబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు వస్తాయి. కంట్రోల్ అనే ఏఐ యాప్‍లో నీలా లాగిన్ అవుతారు. అలెన్ అనే ఏఐ మనిషితో నీలా పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత నీలా జీవితం మారిపోతుంది. జాయ్ మాయం అవుతాడు. నీలా కంట్రోల్ మొత్తం ఆ ఏఐ మనిషి చేతిలోకి వెళ్లిపోతుంది. నీలా జీవితంపై ఎలాంటి ప్రభావం పడింది? ఏ సవాళ్లు ఎదురయ్యాయి? ఏఐ మనిషి నియంత్రణ నుంచి బయటికి రాగలిగిందా? అనే అంశాల చుట్టూ కంట్రోల్ మూవీ సాగుతుంది.