తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suriya Kanguva Movie: సూర్య పాన్ ఇండియ‌న్ డెబ్యూ మూవీ టైటిల్ ఫిక్స్ - ప‌ది భాష‌ల్లో రిలీజ్‌

Suriya Kanguva Movie: సూర్య పాన్ ఇండియ‌న్ డెబ్యూ మూవీ టైటిల్ ఫిక్స్ - ప‌ది భాష‌ల్లో రిలీజ్‌

16 April 2023, 10:23 IST

google News
  • Suriya Kanguva Movie: సూర్య హీరోగా న‌టిస్తోన్న 42వ సినిమా టైటిల్‌ను ఆదివారం రివీల్ చేశారు. సిరుత్తై శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈసినిమా ప‌ది భాష‌ల్లో రిలీజ్ కానుంది.

సూర్య కంగువ‌
సూర్య కంగువ‌

సూర్య కంగువ‌

Suriya Kanguva Movie: సూర్య హీరోగా సిరుత్తైశివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు కంగువ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఆదివారం టైటిల్‌ను రివీల్ చేశారు. కంగువ సినిమాతోనే సూర్య పాన్ ఇండియ‌న్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ప‌ది భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. త్రీడీలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు.

వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో కంగువ‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ఆదివారం చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో సూర్య‌కు జోడీగా దిశాప‌టానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. కంగువ‌ షూటింగ్ 50 శాతం వ‌ర‌కు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. గోవా, చెన్నైల‌లో షూటింగ్ చేశారు. మ‌రో నెల రోజుల్లో బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

వీఎఫ్ఎక్స్‌, సీజీకి ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఉన్న సినిమా కావ‌డంతో ప్రీ ప్రొడ‌క్ష‌న్‌కు స‌మ‌యం ప‌డుతోంద‌ని, అందుకే వ‌చ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమాలో యోగిబాబు కీల‌క పాత్ర‌ను పోషిస్తోన్నారు. సూర్య హీరోగా న‌టిస్తోన్న 42వ మూవీ ఇది. స్టూడియోగ్రీన్‌, యూవీ క్రియేష‌న్స్ సంస్థ‌లు ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.

టైటిల్ పై ట్రోల్స్

కంగువ అంటే అంత్యంత ప‌రాక్ర‌మ‌వంతుడు అని అర్థం. క‌థానుగుణంగానే ఈ టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్లు కోలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తోన్నాయి. మ‌రోవైపు సూర్య ఫ్యాన్స్ మాత్రంఈ టైటిల్‌పై విమ‌ర్శ‌లు వ్య‌క్తం చేస్తోన్నారు. కంగువ అనే పేరు వీడియో గేమ్ పేరులా ఉంద‌ని, క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా లేద‌ని చెబుతోన్నారు.

తదుపరి వ్యాసం