Suriya Chandoo Mondeti Movie: టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న సూర్య - కార్తికేయ 2 డైరెక్టర్‌తో స్ట్రెయిట్ మూవీ
Suriya Chandoo Mondeti Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు దర్శకుడు ఎవరంటే...
Suriya Chandoo Mondeti Movie: గజిని, సెవెన్త్‌సెన్స్ లాంటి తమిళ అనువాద చిత్రాలతో తెలుగులో మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు సూర్య. తెలుగు హీరోల సినిమాలకు ధీటుగా అతడి డబ్బింగ్ సినిమాలు భారీగా ఓపెనింగ్స్‌ను రాబట్టిన సందర్భాలున్నాయి. టాలీవుడ్‌లో తనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో స్ట్రెయిట్ సినిమా చేసేందుకు సూర్య చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తోన్నాడు.
పలువురు స్టార్‌డైరెక్టర్స్‌తో సూర్య తెలుగు సినిమా ఉండొచ్చని గతంలో వార్తలొచ్చినా అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. సూర్య తెలుగు సినిమా వార్తలు మరోసారి టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కార్తికేయ -2 దర్శకుడు చందూ ముండేటి ఇటీవల సూర్యను కలిశారు.
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. చందూ మొండేటి దర్శకత్వంలో సూర్య ఓ స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చెన్నైవెళ్లి సూర్యను కలిసిన కార్తికేయ డైరెక్టర్ అతడికి ఓ కథను వినిపించినట్లు చెబుతోన్నారు. అయితే చందూ కథకు సూర్య ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు.
త్వరలోనే ఈ కాంబోపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ సంస్థలోనే ఈ సినిమా ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గీతా ఆర్ట్స్‌తో సూర్యకు చక్కటి అనుబంధం ఉంది. ఈ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తానని పలు ప్రమోషనల్ ఈవెంట్స్‌లో సూర్య వెల్లడించాడు.
మరోవైపు కార్తికేయ -2 సక్సెస్ తర్వాత గీతా ఆర్ట్స్‌లో తాను ఓ సినిమా చేయబోతున్నట్లు చందూ మొండేటి చెప్పిన సంగతి తెలిసిందే. దాంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయనున్న సినిమా గురించే సూర్యను చందూ మొండేటి కలిసినట్లు చెబుతోన్నారు.
ప్రస్తుతం తమిళంలో శిరుత్తై శివ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పీరియాడికల్ మూవీ చేస్తోన్నాడు సూర్య. పది భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు కార్తికేయ -2 సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్నాడు సూర్య. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.