IND vs AUS 2nd Test Toss: రెండో టెస్ట్‌లో టాస్ ఓడిన ఇండియా - సూర్యకుమార్ ఔట్ - శ్రేయస్ వచ్చేశాడు
IND vs AUS 2nd Test Toss: శుక్రవారం నుంచి ఇండియాతో ప్రారంభమైన రెండో టెస్ట్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌లో ఒకే ఒక మార్పుతో టీమ్ ఇండియా బరిలో దిగుతోంది.
శ్రేయస్ అయ్యర్
IND vs AUS 2nd Test Toss: ఢిల్లీ వేదికగా ఇండియాతో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్‌లో తుది జట్టులో టీమ్ ఇండియా ఒక మార్పు చేసింది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు.
ఈ మ్యాచ్ ద్వారా వందో టెస్ట్ మైలురాయిని చేరుకున్న పుజారాకు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పెషల్ క్యాప్ అందించాడు. మరోవైపు ఆస్ట్రేలియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది.
ట్రావిస్ హెడ్‌తో పాటు కున్‌మెన్ టీమ్‌లోకి వచ్చారు. కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ ఆడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపించినా వారిని తీసుకోలేదు. వార్నర్‌పై నమ్మకంతో అతడిని కొనసాగించారు.