తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suhas - Keerthy Suresh Ott Movie: సుహాస్, కీర్తి సురేశ్ జోడీగా సినిమా.. టైటిల్ ఖరారు.. నేరుగా ఓటీటీలోకే..

Suhas - Keerthy Suresh OTT Movie: సుహాస్, కీర్తి సురేశ్ జోడీగా సినిమా.. టైటిల్ ఖరారు.. నేరుగా ఓటీటీలోకే..

20 March 2024, 17:10 IST

    • Suhas - Keerthy Suresh OTT Movie: యంగ్ హీరో సుహాస్‍తో కలిసి స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటించనున్నారు. ఈ చిత్రానికి టైటిల్ కూడా ఖరారైంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‍కు రానుంది.
Suhas - Keerthy Suresh OTT Movie: సుహాస్, కీర్తి సురేశ్ జోడీగా సినిమా.. టైటిల్ ఖరారు.. నేరుగా ఓటీటీలోకే..
Suhas - Keerthy Suresh OTT Movie: సుహాస్, కీర్తి సురేశ్ జోడీగా సినిమా.. టైటిల్ ఖరారు.. నేరుగా ఓటీటీలోకే..

Suhas - Keerthy Suresh OTT Movie: సుహాస్, కీర్తి సురేశ్ జోడీగా సినిమా.. టైటిల్ ఖరారు.. నేరుగా ఓటీటీలోకే..

Suhas - Keerthy Suresh OTT Film: స్టార్ హీరోయిన్, టాలెంటెడ్ నటి కీర్తి సురేశ్‍కు చాలా క్రేజ్ ఉంది. చాలా మంది స్టార్ హీరోలతో వివిధ భాషల్లో ఆమె సినిమాలు చేశారు. కొన్ని వైవిధ్యమైన పాత్రలను అద్భుతంగా పోషించారు. అందంతో పాటు అభినయంతో మెప్పిస్తున్నారు. అంత స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ కీర్తి సురేశ్.. యంగ్ హీరో సుహాస్‍తో కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‍లో మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. టైటిల్ కూడా ఫిక్స్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Swatantrya Veer Savarkar ott release date: స్వాతంత్య్ర వీర్ సావర్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఆ ప్రత్యేకమైన రోజునే..

Gam Gam Ganesha Trailer: ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

Payal Rajput: చిక్కుల్లో పాయల్ రాజ్‌పుత్.. నిర్మాతల మండలికి రక్షణ ప్రొడ్యూసర్ ఫిర్యాదు

Top 10 IMDb rating movies: ప్రపంచ సినిమాలో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ కలిగిన టాప్ 10 మూవీస్ ఇవే.. ఈ ఓటీటీల్లో చూడండి

టైటిల్ ఇదే..

సుహాస్ - కీర్తి సురేశ్ కాంబినేషన్‍లో రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఉప్పు కప్పురంబు’ అనే టైటిల్ ఖరారైంది. వేమన శతకంలోని ఓ ప్రముఖ పద్యం తొలి వాక్యంతో ఈ పేరు పెట్టారు. టైటిల్ డిఫరెంట్‍గా ఉండడం, క్రేజీ కాంబినేషన్‍తో రానుండటంతో ఈ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొంది. ఉప్పు కప్పురంబు సినిమాకు నిన్నిలా.. నిన్నిలా ఫేమ్ డైరెక్టర్ అని ఐవీ శశి దర్శకత్వం వహించనున్నారు.

ఓటీటీలో నేరుగా..

ఉప్పు కప్పురంబు సినిమా టైటిల్‍ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. ప్రైమ్ వీడియో ఈవెంట్‍లో ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. అమెజాన్ ఒరిజినల్స్ కింద ఈ మూవీ రూపొందనుంది. అంటే.. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ అవుతుంది. షూటింగ్ పూర్తయ్యాక స్ట్రీమింగ్ డేట్‍ను ప్రైమ్ వీడియో వెల్లడించనుంది.

స్టోరీ లైన్ ఇదే

ఉప్పు కప్పురంబు సినిమా స్టోరీ లైన్‍ను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో వెల్లడించింది. సెటైరికల్ కామెడీ మూవీగా ఇది రానుంది. “శ్మశానంలో స్థలం అయిపోవడంతో ఓ గ్రామంలో అనూహ్యమైన ఇబ్బందులు ఏర్పడతాయి. దీంతో ప్రజల మధ్య గందరగోళం ఏర్పడుతుంది. ఈ అసాధారణమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి” అని ఉప్పు కప్పురంబు మూవీ స్టోరీ లైన్‍ను ప్రైమ్ వీడియో రివీల్ చేసింది.

ఉప్పు కప్పురంబు చిత్రానికి వసంత్ మురళీ కృష్ణ కథ అందిస్తుండగా.. అని ఐవీ శశి దర్శకత్వం వహించనున్నారు. రాధిక లావూ నిర్మాతగా ఉన్నారు.

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలతో భారీ సినిమాలు చేసిన కీర్తి సురేశ్.. సుహాస్‍తో ఈ మూవీ చేస్తుండటంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆమెను ప్రశంసిస్తున్నారు.

యూట్యూబ్‍లో షార్ట్ ఫిలింలతో కెరీర్ మొదలుపెట్టిన సుహాస్.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో కమెడియన్‍గా చేశారు. ‘కలర్ ఫొటో’ చిత్రంతో హీరో అయ్యారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. గతేడాది రైటర్ పద్మభూషణం చిత్రంతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఏడాది సుహాస్ హీరోగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమా విజయం సాధించింది. దీంతో హీరోగా స్థిరపడ్డారు సుహాస్.

సుహాస్ లైనప్‍లో ప్రస్తుతం ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం, కేబుల్ రెడ్డితో పాటు మరో సినిమా కూడా ఆయన చేస్తున్నారు. ప్రసన్నవదనం ఏప్రిల్ 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. మొత్తంగా వరుస సినిమాలతో సుహాస్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఉప్పు కప్పురంబు సినిమా కూడా చేయనున్నారు.

కీర్తి సురేశ్ ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నారు. బేబీ జాన్ అనే హిందీ మూవీకి కూడా ఓకే చెప్పారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం