తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Star Maa Serials Trp Ratings: కార్తీకదీపంకు గట్టి పోటీ ఇస్తున్న స్టార్ మా కొత్త సీరియల్.. లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే

Star Maa Serials TRP Ratings: కార్తీకదీపంకు గట్టి పోటీ ఇస్తున్న స్టార్ మా కొత్త సీరియల్.. లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే

Hari Prasad S HT Telugu

19 December 2024, 16:35 IST

google News
    • Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. తాజాగా వచ్చిన రేటింగ్స్ లో కార్తీకదీపం సీరియల్ టాప్ లో కొనసాగుతున్నా.. కొత్తగా ప్రారంభమైన సీరియల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. అటు జీ తెలుగు సీరియల్స్ రేటింగ్స్ లోనూ మార్పులు వచ్చాయి.
కార్తీకదీపంకు గట్టి పోటీ ఇస్తున్న స్టార్ మా కొత్త సీరియల్.. లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే
కార్తీకదీపంకు గట్టి పోటీ ఇస్తున్న స్టార్ మా కొత్త సీరియల్.. లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే

కార్తీకదీపంకు గట్టి పోటీ ఇస్తున్న స్టార్ మా కొత్త సీరియల్.. లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ఇవే

Star Maa Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ 50వ వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో స్టార్ మా సీరియల్స్ ఎప్పటిలాగే పూర్తిగా డామినేట్ చేశాయి. కార్తీకదీపం సీరియల్ టాప్ లోనే కొనసాగుతున్నా కొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. జీ తెలుగులో పడమటి సంధ్యారాగం దూసుకెళ్తోంది. మరి తెలుగులో టాప్ 10 సీరియల్స్ ఏవో ఒకసారి చూద్దాం.

స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

స్టార్ మా సీరియల్స్ తాజాగా 50వ వారం టీఆర్పీ రేటింగ్స్ లోనూ సత్తా చాటాయి. తాజాగా రిలీజైన రేటింగ్స్ లో కార్తీకదీపం సీరియల్ 11.93తో తొలి స్థానంలో కొనసాగుతోంది. బ్రహ్మముడి సమయం మారినప్పటి నుంచీ కార్తీకదీపం టాప్ లోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక రెండో స్థానంలో ఈ మధ్యే ప్రారంభమైన ఇల్లు ఇల్లాలు పిల్లలు నిలిచింది.

ఈ సీరియల్ కు తాజాగా 11.68 రేటింగ్ నమోదు కావడం విశేషం. అంటే కార్తీకదీపంకు ఈ సీరియల్ నుంచి ముప్పు పొంచి ఉన్నట్లే. ఇక మూడో స్థానంలో చిన్ని (10.77), నాలుగో స్థానంలో ఇంటింటి రామాయణం (10.52), ఐదో స్థానంలో గుండెనిండా గుడిగంటలు (10.35), ఆరో స్థానంలో మగువ ఓ మగువ (9.27) ఉన్నాయి. బ్రహ్మముడి 6.26 రేటింగ్ తో టాప్ 10లోనే లేకుండా పోయింది. ఈ సీరియల్ ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.

జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

అటు జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే పడమటి సంధ్యారాగం తాజా రేటింగ్స్ లో సత్తా చాటింది. ఏకంగా 8.49 రేటింగ్ తో జీ తెలుగులో టాప్, ఓవరాల్ గా ఏడో స్థానంలో ఉంది. ఆ తర్వాత మేఘ సందేశం 7.98, నిండు నూరేళ్ల సావాసం 7.87, జగద్ధాత్రి 7.02, త్రినయని 6.62 సీరియల్స్ నిలిచాయి. మేఘ సందేశం కొద్ది రోజులుగా జీ తెలుగులో టాప్ లో ఉండగా.. లేటెస్ట్ రేటింగ్స్ లో పడమటి సంధ్యారాగం మరోసారి దూసుకొచ్చింది.

ఈటీవీ, జెమెని సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్

ఈటీవీ సీరియల్స్ విషయానికి వస్తే రంగులరాట్నం టాప్ లో ఉంది. ఈ సీరియల్ తాజా రేటింగ్స్ లో 3.85 సాధించింది. ఆ తర్వాత మనసంతా నువ్వే సీరియల్ 3.39, రావోయి చందమామ 3.06, బొమ్మరిల్లు 3.05, శతమానంభవతి 2.52 రేటింగ్స్ సాధించాయి.

జెమిని సీరియల్స్ రేటింగ్స్ మాత్రం ఎప్పటిలాగే చాలా వెనుకబడి ఉన్నాయి. కాకపోతే కొత్తగా రెక్కలొచ్చెనా సీరియల్ 1.25 రేటింగ్ తో టాప్ లోకి దూసుకొచ్చింది. శ్రీమద్ రామాయణం 1.19తో రెండో స్థానానికి పడిపోయింది. భైరవి 1.05, సివంగి 1.01, నువ్వే కావాలి 0.95, కానిస్టేబుల్ మంజు 0.73 రేటింగ్స్ సాధించాయి.

తదుపరి వ్యాసం