Trinayani Serial: త్రినయని సీరియల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్. ఈ బ్లాక్‌బస్టర్ సీరియల్ త్వరలోనే ముగియబోతుంది. మరో పదిహేను రోజుల్లో ఈ సీరియల్‌కు జీ తెలుగు ఎండ్ కార్డ్ వేయబోతున్నట్లు తెలిసింది. డిసెంబర్ 21న క్లైమాక్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానున్నట్లు చెబుతోన్నారు.
జీ తెలుగులోనే కాకుండా ప్రస్తుతం తెలుగులో లాంగెస్ట్ రన్నింగ్ టీవీ సీరియల్స్‌లో ఒకటిగా త్రినయని కొనసాగుతోంది. 2020 మార్చి 2న త్రినయని సీరియల్ ప్రారంభమైంది. నాలుగేళ్లలో ఇప్పటివరకు 1421 ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయ్యాయి. మరో పదహారు ఎపిసోడ్స్‌తో ఈ సీరియల్‌ను మేకర్స్ ముగించబోతున్నట్లు సమాచారం.
త్రినయని సీరియల్‌లో టైటిల్ పాత్రలో ఆషికా పదుకుణే నటించింది. చందు గౌడ, చైత్ర కీలక పాత్రల్లో నటించారు. ఈ సీరియల్‌లో తిలోత్తమ పాత్రలో తొలుత పవిత్రా జయరామ్ కనిపించింది. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్రా జయరామ్ కన్నుమూయడంతో ఆమె స్థానంలో చైత్రను మేకర్స్ సెలెక్ట్ చేశారు.
త్రినయని సీరియల్ జీ తెలుగులో టీఆర్‌పీ రేటింగ్ పరంగా ఒకప్పుడు టాప్ ప్లేస్‌లో నిలిచింది. ప్రస్తుతం జీ తెలుగు సీరియల్స్‌లో టాప్ ఫైవ్‌లో ఒకటిగా కొనసాగుతోంది. లేటెస్ట్ టీఆర్‌పీ లో 6.51 రేటింగ్‌ను దక్కించుకుంది.
దైవ శక్తులకు, అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే పోరాటంలో త్రినయని అనే మహిళ ఎదుర్కొనే సంఘర్షణ నేపథ్యంలో సూపర్ నాచురల్ ఫాంటసీ డ్రామాగా ఈ సీరియల్ తెరకెక్కింది. ఆమె జీవితంలోకి విశాల్ ఎలా వచ్చాడు? విశాల్ సవతి తల్లి తిలోత్తమ కారణంగా త్రినయని ఎలాంటి కష్టాలు ఎదుర్కొంది అనే అంశాలతో ఈ సీరియల్‌ను నాలుగేళ్లుగా మేకర్స్ నడిపిస్తోన్నారు. త్రినయని సీరియల్ తమిళం, మలయాళం, బెంగాళీ, మరాఠీతో పాటు మరికొన్ని భాషల్లో డబ్ అయ్యింది. అన్ని భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచింది.
త్రినయని సీరియల్ కోసం ఆషికా పదుకునే భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటోన్నట్లు సమాచారం. ఒక్కో ఎపిసోడ్ కోసం ఇరవై ఐదు వేలకుపైగా రెమ్యునరేషన్ స్వీకరిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. త్రినయని కంటే ముందు తెలుగులో కథలో రాజకుమారి సీరియల్ చేసింది ఆషికా పదుకునే. త్రినయని స్థానంలో లాంఛ్ కానున్న కొత్త సీరియల్ ఏదన్నది త్వరలోనే రివీల్ కానుంది.