Star Maa Serial: స్టార్ మా సీరియల్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న మలయాళం హీరోయిన్ - టెలికాస్ట్ డేట్ ఫిక్స్!
27 November 2024, 13:02 IST
Star Maa Serial: గీతా ఎల్ఎల్‌బీ సీరియల్ టెలికాస్ట్ డేట్, టైమింగ్స్‌ను స్టార్ మా రివీల్ చేసింది. డిసెంబర్ 2 నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి పది గంటల వరకు ఈ సీరియల్ టెలికాస్ట్ కాబోతోంది. గీతా ఎల్ఎల్‌బీ సీరియల్‌లో మలయాళ హీరోయిన్ నీతూ మాయ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
స్టార్ మా సీరియల్
Star Maa Serial: స్టార్ మా ఛానెల్ ద్వారా మరో కొత్త సీరియల్ త్వరలోనే అభిమానుల ముందుకు రాబోతోంది. గీతా ఎల్ఎల్‌బీ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సీరియల్ టెలికాస్ట్ డేట్, టైమింగ్స్‌ను స్టార్ మా రివీల్ చేసింది. డిసెంబర్ 2న ఈ సీరియల్ ప్రారంభం కాబోతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి పది గంటల వరకు స్టార్ మా ఛానెల్‌లో ఈ సీరియల్‌ను చూడొచ్చని ప్రకటించింది.
కోర్ట్ రూమ్ డ్రామా...
కోర్ట్ రూమ్ డ్రామాగా గీతా ఎల్ఎల్‌బీ సీరియల్ రూపొందుతోన్నట్లు ప్రోమో చూస్తుంటూ కనిపిస్తోంది. వేధింపులను ఎదుర్కొన్న అమ్మాయి తరఫున లాయర్ గీతా వాదించినట్లుగా ప్రోమోలో చూపించారు. అపోజిట్‌గా వాదిస్తోన్న మహారథి అనే లాయర్ కేసులో గీతా ఓడిపోవాలని వార్నింగ్ ఇచ్చినట్లుగా ప్రోమోలో కనిపిస్తోంది.
నీ అక్క నా ఇంటి కోడలు అనే సంగతి మర్చిపోకు...నీకు కేసు కావాలో...నీ అక్క క్షేమం కావాలో తెల్చుకో అని అపోజిట్ లాయర్ గీతాకు వార్నింగ్ ఇచ్చాడు. ఒక లాయర్‌గా గెలవాలని మేము కోరుకుంటాం..కానీ ఒక చెల్లెలిగా నువ్వు ఓడిపోకూడదు కదా అంటూ గీతా తల్లి ఆమెతో సెంటిమెంట్ డైలాగ్ చెప్పడం ప్రోమోలో ఆకట్టుకుంటుంది.
జై బాలయ్య...
కోర్డులో పాము అంటూ అరిచి తెలివిగా నాటకం ఆడి తన క్లయింట్‌ను కేసులో గీతా గెలిపించినట్లుగా చూపించారు. న్యాయం కోసం..నా వాళ్ల కోసం ఎంతదూరమైన వెళతాను గురువు గారు...అంటూ మహారథి పాత్రకు గీత పంచ్‌లు వేయడం ప్రోమోకు హైలైట్‌గా నిలిచింది. నీలో ఈ టాలెంట్ కూడా తోటి లాయర్ అడగ్గా...సినిమాలు చూడటం లేదా...జై బాలయ్య అంటూ గీతా పాత్రధారి చెప్పడంతో ప్రోమో ఎండ్ అయ్యింది.
మలయాళ హీరోయిన్...
గీతా ఎల్ఎల్‌బీ సీరియల్‌లో నీతూ మాయ టైటిల్ పాత్రలో నటిస్తోంది. మలయాళ హీరోయిన్ అయిన నీతూ మాయ ఈ సీరియల్‌తోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. పంతంతో పాటు మలయాళంలో పలు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసింది నీతూ మాయ. గీతాఎల్ఎల్‌బీ సీరియల్‌లో భవీష్ హీరోగా నటిస్తోన్నాడు. శ్వేత విజయ్‌కుమార్, ఇమ్రాన్ ఖాన్ నెగెటివ్ రోల్స్‌లో కనిపించబోతున్నారు. బెంగాళీసీరియల్ గీతా ఎల్ఎల్‌బీకి రీమేక్‌గా అదే పేరుతో గీతా ఎల్ఎల్‌బీ సీరియల్ రూపొందుతోంది.