SSMB28 Title Reveal: మహేష్-త్రివిక్రమ్ మూవీ టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్.. తొలిసారి వైవిధ్యంగా ప్రకటన
26 May 2023, 17:29 IST
- SSMB28 Title Reveal: మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో రానున్న SSMB28 మూవీ టైటిల్ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. సూపర్ స్టార్ కృష్ణ జయంతి నాడు ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించనున్నట్లు తెలిపింది.
మహేష్ బాబు మూవీ టైటిల్ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్
SSMB28 Title Reveal: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడో సారి వీరి కాంబో రిపీట్ అవుతున్న తరుణంలో ఫ్యాన్స్ ఆత్రుతగా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా.. దీనికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది మినహా ఈ సినిమా అప్డేట్లు ఇంకేమి ఇవ్వలేదు చిత్రబృందం. తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ మూవీ టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న మహేష్-త్రివిక్రమ్ మూవీ టైటిల్‌ను ప్రకటించనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అంతేకాకుండా ఈ టైటిల్ ప్రకటనను వెండితెరపై ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. తొలిసారిగా మూవీ టైటిల్‌ను బిగ్ స్క్రీన్‌పై ప్రదర్శించనున్నట్లు తెలిపడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎగ్జయిట్ అవుతున్నారు. ప్రేక్షకులకు చేరువలో ఉండే థియేటర్లలోనే ఈ టైటిల్ ప్రదర్శించనున్నట్లు తెలియజేశారు.
ఈ మూవీలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఇప్పటికే మహేష్‌తో కలిసి ఈ ముద్దుగుమ్మ మహర్షి సినిమాలో నటించింది. 2019లో విడుదలైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. దీంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న SSMB28లోనూ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది. మరో హీరోయిన్‌గా శ్రీలీల చేస్తోంది. గతంలో ఇంతకుముందెన్నడు చూడని విధంగా మహేష్ బాబు స్టైలిష్‌గా కనువిందు చేశారు. పొడవాటి జుట్టుతో స్టైలిష్ లుక్‌లో ఆకర్షణీయంగా కనిపించారు.
ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం గమనార్హం. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.