Swag OTT: స్వాగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - శ్రీవిష్ణు కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
05 October 2024, 11:42 IST
Swag OTT: శ్రీవిష్ణు హీరోగా నటించిన స్వాగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకున్నది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్వాగ్ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.
స్వాగ్ ఓటీటీ
Swag OTT: శ్రీవిష్ణు హీరోగా నటించిన స్వాగ్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. లింగవివక్ష పాయింట్‌కు కామెడీని జోడించి దర్శకుడు హసిత్ గోలి ప్రయోగాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించాడు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో మీరా జాస్మిన్, దక్షా నగార్కర్ కీలక పాత్రల్లో కనిపించారు.
ప్రమోషన్స్‌తోపాటు టీజర్స్, ట్రైలర్స్ డిఫరెంట్‌గా ఉండటంతో తొలిరోజు స్వాగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టినట్లు సమాచారం. శుక్రవారం రోజు కోటికిపైనే ఈ మూవీ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు చెబుతోన్నారు.
అమెజాన్ ఓటీటీ...
స్వాగ్ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు చెబుతోన్నారు. నవంబర్ సెకండ్ వీక్‌లో స్వాగ్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఫ్యాన్సీ రేటుకు స్వాగ్ ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం.
ఐదు పాత్రల్లో శ్రీవిష్ణు...
స్వాగ్ మూవీలో శ్రీవిష్ణు ఐదు పాత్రల్లో కనిపించగా...రీతూ వర్మ రెండు క్యారెక్టర్స్ చేసింది. ఆడ, మగ, ట్రాన్స్‌జెండర్లు అనే భేదాలు లేకుండా సొసైటీలో అందరూ సమానమనే సున్నితమైన అంశాన్ని ఎలాంటి వివాదాలకు తావులేకుండా స్వాగ్ మూవీలో ఆవిష్కరించారు దర్శకుడు. నవ్విస్తూనే తాను చెప్పాలనుకున్న సందేశాన్నిచూపించారు.
కాన్సెప్ట్ బాగున్నా...సినిమాలో చాలా పాత్రలు ఉండటం, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కన్ఫ్యూజింగ్‌గా సాగడం స్వాగ్‌కు మైనస్‌గా మారింది. శ్రీవిష్ణు నటనపై మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి. ఐదు పాత్రలకు పూర్తిగా న్యాయం చేశాడని అంటున్నారు. మీరాజాస్మిన్, రీతూ వర్మ నటన బాగుందని చెబుతున్నారు.
స్వాగ్ మూవీ కథ ఇదే...
శ్వాగణిక వంశానికి చెందిన కోట్ల రూపాయల ఆస్తి కోసం వంశ వృక్ష నిలయానికి వస్తాడు భవభూతి (శ్రీవిష్ణు) . ఆ ఆస్తికి వారసులమంటూ అతడితో పాటు అక్కడికి సింగ(శ్రీవిష్ణు), అనుభూతి ( రీతూ వర్మ) కూడా వస్తారు. ఈ ముగ్గురిలో శ్వాగణిక ఆస్తికి నిజమైన వారసులు ఎవరు? భవభూతి, సింగలకు ఆస్తి దక్కుండా యయాతి ఏం చేశాడు?
1551 ఏళ్ల క్రితం మాతృస్వామ్య వ్యవస్థ కోసం పోరాడిన వింజమర వంశ రాణి రుక్మిణి దేవి (రీతూ వర్మ) కథేమిటి? ఆ కలలకు శ్వాగణిక మూలపురుషుడు భవభూతి (శ్రీ విష్ణు) ఎలా చెక్ పెట్టాడు? ఈ కథలోకి విభూతి ఎలా వచ్చాడు? భవభూతి భార్య రేవతి అతడికి ఎందుకు దూరమైంది అన్నదే స్వాగ్ మూవీ కథ.
శ్వాగ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. రవిబాబు, సునీల్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు.