Swag Twitter Review: స్వాగ్ ట్విట్టర్ రివ్యూ - బోల్డ్ కాన్సెప్ట్ - హిలేరియస్ కామెడీ - శ్రీవిష్ణు మూవీ టాక్ ఏంటంటే?
Swag Movie Twitter Review: రాజరాజచోర తర్వాత హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్‌లో వచ్చిన స్వాగ్ మూవీ అక్టోబర్ 4న (శుక్రవారం) రిలీజైంది. ఈ మూవీలో రీతూవర్మ, మీరాజాస్మిన్ కీలక పాత్రలు చేశారు. స్వాగ్ మూవీతో శ్రీవిష్ణుకు హ్యాట్రిక్ హిట్ దక్కిందా? లేదా? అంటే?
Swag Movie Twitter Review: కామెడీ కథాంశాలతో తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు శ్రీవిష్ణు. సామజవరగమనా, ఓం భీమ్ బుష్ సక్సెస్‌ల తర్వాత శ్రీవిష్ణు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకొని నటించిన మూవీ స్వాగ్. హసిత్ గోలి దర్శకత్వం వహించిన స్వాగ్ మూవీ శుక్రవారం(నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. రీతూవర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మీరాజాస్మిన్ కీలక పాత్ర చేసింది. ఈ సినిమా ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
బోల్డ్ కాన్సెప్ట్...
స్వాగ్ మూవీకి ఓవర్‌సీస్ ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ప్రయోగాత్మక మూవీ ఇదని ఓవర్‌సీస్ ఆడియెన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. లింగ సమానత్వానికి సంబంధించి నవ్విస్తూనే ఓ స్ట్రాంగ్ మెసేజ్‌ను దర్శకుడు ఈ మూవీతో ఇచ్చినట్లు చెబుతోన్నారు.
మల్టీపుల్ షేడ్స్...
ఇందులో భవభూతి, విభూది, యయతి, సింగ అనే మల్టీపుల్ షేడ్స్‌తో సాగే నాలుగు క్యారెక్టర్స్ లో శ్రీవిష్ణు అదరగొట్టాడని, పాజిటివ్, నెగెటివ్ ...రెండు కోణాల్లో అతడి క్యారెక్టర్ సాగుతుందని అంటున్నారు. ఈ క్యారెక్టర్స్ మధ్య లుక్, డైలాగ్ డెలివరీ పరంగా శ్రీవిష్ణు చూపించిన వేరియేషన్స్ బాగున్నాయని నెటిజన్ అన్నాడు. శ్రీవిష్ణు కెరీర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్‌లలోఒకటిగా స్వాగ్‌మూవీ నిలుస్తుందని అతడు కామెంట్ చేశాడు. శ్రీవిష్ణు వన్ మెన్ షోగా ఈ మూవీ నిలుస్తుందని అంటున్నారు.
హిలేరియస్ కామెడీ...
స్వాగ్ మూవీలో ఎమోషన్స్‌తో పాటు కామెడీ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ట్విస్ట్‌లు అదరిపోతాయని, ఆడియెన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌కు పూర్తి భిన్నంగా దర్శకుడు మలుపులను రాసుకున్న తీరు బాగుందని పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ మాత్రం గూస్‌బంప్స్‌ను కలిగిస్తుందని అంటున్నారు.
రీఎంట్రీలో...
రీతూవర్మ చాలా రోజుల తర్వాత ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో చక్కటి నటనతో మెప్పించిందని చెబుతున్నారు. మీరాజాస్మిన్ రీఎంట్రీలో మంచి క్యారెక్టర్ దక్కిందని అంటున్నారు. సినిమాలో ఆమె పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని అంటున్నారు.
రెండో సినిమా విఘ్నాన్ని దర్శకుడు హసిత్ గోలి స్వాగ్‌తో దాటేశాడని అంటున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచిందని ట్వీట్స్ చేస్తున్నారు. స్వాగ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.