OTT Kannada Dark Comedy: సూపర్ హిట్ కన్నడ డార్క్ కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్-ott kannada dark comedy movie powder to stream on amazon prime video from october 4th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Kannada Dark Comedy: సూపర్ హిట్ కన్నడ డార్క్ కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Kannada Dark Comedy: సూపర్ హిట్ కన్నడ డార్క్ కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Hari Prasad S HT Telugu
Oct 02, 2024 03:44 PM IST

OTT Kannada Dark Comedy: ఓటీటీలోకి మరో సూపర్ హిట్ కన్నడ డార్క్ కామెడీ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు పౌడర్. థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది.

సూపర్ హిట్ కన్నడ డార్క్ కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ హిట్ కన్నడ డార్క్ కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Kannada Dark Comedy: ఓ ఇంట్రెస్టింగ్ కన్నడ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. డార్క్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్ట్ 23న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియోల సుమారు నెలన్నర రోజుల తర్వాత మూవీని ఓటీటీలోకి తీసుకురాబోతోంది.

పౌడర్ ఓటీటీ రిలీజ్ డేట్

కన్నడ డార్క్ కామెడీ మూవీ పేరు పౌడర్. ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక్కడ పౌడర్ అంటే డ్రగ్స్. ఓ మిస్ అయిన డ్రగ్స్ కన్సైన్‌మెంట్ ను తిరిగి చేజిక్కించుకునే క్రమంలో ఓ విలన్ గ్యాంగ్ ఎదుర్కొన్న సవాళ్లను సరదాగా చూపించే ప్రయత్నం చేశారు.

ఈ మూవీని జనార్దన్ చిక్కన్న డైరెక్ట్ చేయగా.. దిగంత్, ధన్య రామ్ కుమార్, షర్మిలా మాంద్రే, అనిరుధ్ ఆచార్య, రంగాయన రఘు, రవిశంకర్ గౌడ, గోపాల్ కృష్ణ దేశ్‌పాండేలాంటి వాళ్లు నటించారు. నిజానికి జులై 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆగస్ట్ 23న థియేటర్లలో రాగా.. సుమారు 50 రోజుల తర్వాత ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది. లాజిక్ ను పక్కన పెట్టి చూస్తే ఈ పౌడర్ మూవీ మంచి కామెడీని అందిస్తుందంటూ రిలీజ్ సమయంలో రివ్యూలు వచ్చాయి.

ఓటీటీల్లోని లేటెస్ట్ కన్నడ సినిమాలు

ఈ మధ్య ఓటీటీల్లో కన్నడ సినిమాలకు కూడా తెలుగు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అందుకే చాలా వరకు సినిమాలను తెలుగు డబ్బింగ్ లేదంటే సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో కొన్ని ఇంట్రెస్టింగ్ కన్నడ సినిమాలు ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి.

ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫ్యామిలీ డ్రామా అనే కన్నడ సినిమా అడుగుపెట్టింది. ఇదే కాకుండా ప్రైమ్ వీడియోలోనే బ్లింక్, భీమా, చిల్లీ చికెన్ లాంటి కన్నడ సినిమాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక అనవరణ అనే మరో కన్నడ మూవీ నమ్మఫ్లిక్స్ ఓటీటీలోకి గత నెలలో వచ్చింది. ఇదే కాకుండా క్రష్, ఒందు ఘంటేయ కథె, ఆన్లైన్ మధువే ఆఫ్‌లైన్ శోభనలాంటి కన్నడ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Whats_app_banner