OTT Movie: తెలుగులో మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చిన కన్నడ థ్రిల్లర్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చు?-kannada sci fi thriller movie blink now streaming in telugu on aha telugu ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movie: తెలుగులో మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చిన కన్నడ థ్రిల్లర్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చు?

OTT Movie: తెలుగులో మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చిన కన్నడ థ్రిల్లర్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చు?

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 30, 2024 08:29 AM IST

OTT Movie: బ్లింక్ సినిమా ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మంచి వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా ఈ కన్నడ సైన్స్ ఫిక్షన్ చిత్రం తెలుగులో మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

OTT Movie: తెలుగులో మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చిన కన్నడ థ్రిల్లర్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చు?
OTT Movie: తెలుగులో మరో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చిన కన్నడ థ్రిల్లర్ చిత్రం.. ఎక్కడ చూడొచ్చు?

ఓ ఓటీటీలో మంచి సక్సెస్ అయిన కొన్ని చిత్రాలు ఇటీవల మరో ప్లాట్‍ఫామ్‍లో కూడా అడుగుపెడుతున్నాయి. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. కన్నడ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘బ్లింక్’ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే ఓ ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకోగా.. ఇప్పుడు తెలుగులో మరో ఓటీటీలోకి అడుగుపెట్టింది.

స్ట్రీమింగ్ ఎక్కడ?

బ్లింక్ సినిమా తాజాగా తెలుగు డబ్బింగ్‍లో ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. “కనురెప్ప కొట్టడంతో అపూర్వ జీవితం తలకిందులు అయింది. కుటుంబం, ప్రేమకు సంబంధించిన గ్రిప్పింగ్ సైన్స్ ఫిక్షన్ కథను చూసేయండి” అని ఆహా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్లింక్ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చినట్టు వెల్లడించింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ముందుగా మే నెలలో కన్నడలో బ్లింక్ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. భారీ వ్యూస్ దక్కించుకుంది. దీంతో తెలుగు డబ్బింగ్‍లోనూ ప్రైమ్ వీడియో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో డిఫరెంట్ నరేషన్‍తో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో బాగా పాపులర్ అయింది. బ్లింక్ మూవీకి శ్రీనిధి బెంగళూరు దర్శకత్వం వహించారు. ఆహా ఓటీటీలోనూ ఈ చిత్రం మంచి వ్యూస్ దక్కించుకునే అవకాశం ఉంది.

తమిళంలోనూ రీసెంట్‍గా..

బ్లింక్ సినిమా తమిళంలోనూ ఇటీవల డబ్బింగ్ అయింది. ఈ మూవీ తమిళ వెర్షన్ ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి సెప్టెంబర్ 25న అడుగుపెట్టింది. ఇప్పుడు, తెలుగు డబ్బింగ్‍లోనూ ఆహా తీసుకొచ్చింది. ఆహా తెలుగు ప్లాట‍్‍ఫామ్‍లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో బ్లింక్ చిత్రాన్ని చూసేయవచ్చు.

నాలుగు కాలల మధ్య టైమ్ ట్రావెల్‍తో సాగే కథతో బ్లింక్ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు డైరెక్టర్ శ్రీనిధి బెంగళూరు. కనురెప్ప కొట్టకుండా నియంత్రించుకోగలిగే యువకుడికి తమ కుటుంబం గురించి ఓ నిజం తెలియటంతో ట్విస్ట్ వస్తుంది. ఆ తర్వాత అతడు టైమ్‍ట్రావెల్ చేయడం, సవాళ్లను ఎదుర్కోవటం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఈ ఏడాది మార్చిలో ఈ చిత్రం కన్నడలో థియేటర్లలోకి వచ్చింది.

బ్లింక్ సినిమాలో కన్నడ యంగ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి లీడ్ రోల్ చేశారు. దసరా చిత్రంతో తెలుగులోనూ దీక్షిత్ పాపులర్ అయ్యారు. ఆ మూవీలో నాని ఫ్రెండ్‍గా ముఖ్యమైన పాత్ర చేశారు. దీంతో దీక్షిత్‍ది తెలిసిన ముఖమే కావటంతో ఓటీటీలో తెలుగులోనూ బ్లింక్ చిత్రానికి ప్రైమ్ వీడియోలో మంచి వ్యూస్ దక్కాయి. ఇప్పుడు ఆహాలో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

బ్లింక్ చిత్రంలో చైత్ర ఆచార్, గోపాల్ కృష్ణ దేశ్‍పాండే, మందార, వజ్రధీర్, కిరణ్ నాయక్, సౌమ్యశ్రీ మర్నాడ్, సురేశ్ అనగాలి కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ మ్యూజిక్ ఇచ్చారు. జనని పిక్చర్స్ పతాకంపై రవీంద్ర ప్రొడ్యూజ్ చేశారు.

కాగా, ఆహా ఓటీటీలోకి అక్టోబర్ 2వ తేదీన ‘35 - చిన్న కథ కాదు’ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నెలలోగానే అక్టోబర్ 2న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.