Eagle Sequel: రవితేజ ఈగల్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తోంది - పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్
Eagle Sequel: రవితేజ ఈగల్ మూవీకి సీక్వెల్ రాబోతోంది. ఈగల్ మూవీ క్లైమాక్స్‌లో సీక్వెల్ టైటిల్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.
Eagle Sequel: ప్రస్తుతం టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొత్త సినిమాలకు క్లైమాక్స్‌లలో సీక్వెల్స్‌ను అనౌన్స్ చేస్తూ ఆడియెన్స్‌ను మేకర్స్ సర్‌ప్రైజ్ చేస్తోన్నారు. ఈ సీక్వెల్ ట్రెండ్‌లో రవితేజ ఈగల్ కూడా చేరింది. ఈగల్‌కు పార్ట్ 2 రాబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. సీక్వెల్ టైటిల్‌ను కూడా ప్రకటించారు. ఈగల్ 2 - యుద్ధకాండ పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కించబోతున్నట్లు వెల్లడించి రవితేజ అభిమానులను ఖుషిచేశారు. ఈగల్ రిజల్ట్‌ను అనుసరించి ఈ సీక్వెల్ షూటింగ్‌పై తొందరలోనే అప్‌డేట్ రానున్నట్లు సమాచారం. రవితేజ షూటర్ పాత్రను కంటిన్యూ చేస్తూ మరో డిఫరెంట్ పాయింట్‌తో ఈగల్ 2 తెరకెక్కే అవకాశం ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
శుక్రవారం రిలీజ్...
ఈగల్ మూవీ శుక్రవారం థియేటర్లలో రిలీజైంది.రైతు సమస్యలకు యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ఓవర్‌సీస్ ప్రీమియర్స్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో సహదేవ వర్మ అనే షూటర్ పాత్రలో రవితేజ యాక్టింగ్, హీరోయిజంతో పాటు అతడిపై తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయంటూ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. కంప్లీట్‌గా స్క్రీన్‌ప్లే బేస్‌డ్ గా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఈగల్ మూవీని తెరకెక్కించాడంటూ చెబుతున్నారు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్స్‌ను మరిపిస్తూ ఈగల్‌తో రవితేజ అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్...
ఈగల్ థియేట్రికల్ బిజినెస్ వరల్డ్ వైడ్‌గా 21 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. ఏపీ తెలంగాణలో కలిపి థియేట్రికల్ హక్కులు 17 కోట్లకు అముడుపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా 21 కోట్ల వరకు ఈగల్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు చెబుతున్నారు. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజ్ అవుతోంది. సినిమాపై ఉన్న పాజిటివ్ బజ్ కారణంగా ఫస్ట్ డే ఈగల్ 12 కోట్ల వరకు గ్రాస్, ఐదు కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అనుపమతో ఫస్ట్ టైమ్...
ఈగల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ హీరోయిన్‌గా నటించింది. రవితేజ, అనుపమ కాంబినేషన్‌లో రూపొందిన ఫస్ట్ మూవీ ఇదే . కావ్య థాపర్ మరో హీరోయిన్‌గా కనిపించింది. నవదీప్ కీలక పాత్ర పోషించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈగల్ మూవీని నిర్మిస్తున్నాడు. సూర్య వర్సెస్ సూర్య తో కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత ఈగల్‌తో మళ్లీ మెగాఫోన్ పట్టాడు.
సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది...
సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈగల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత అనుకున్నారు. కానీ సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, హనుమాన్ రిలీజ్ కావడంతో ఈగల్ వాయిదాపడింది. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీ షూటింగ్‌తో రవితేజ బిజీగా ఉన్నాడు. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ రైడ్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న మిస్టర్ బచ్చన్ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.