Guntur Kaaram OTT Deal Price:గుంటూరు కారం ఓటీటీ, థియేట్రిక‌ల్ బిజినెస్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే లాభాల్లోకి నిర్మాత‌లు!-mahesh babu guntur kaaram theatrical and ott business closed with record price trivikram sreeleela ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guntur Kaaram Ott Deal Price:గుంటూరు కారం ఓటీటీ, థియేట్రిక‌ల్ బిజినెస్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే లాభాల్లోకి నిర్మాత‌లు!

Guntur Kaaram OTT Deal Price:గుంటూరు కారం ఓటీటీ, థియేట్రిక‌ల్ బిజినెస్ క్లోజ్ - రిలీజ్‌కు ముందే లాభాల్లోకి నిర్మాత‌లు!

Nelki Naresh Kumar HT Telugu
Jan 01, 2024 12:10 PM IST

Guntur Kaaram OTT Deal Price: రిలీజ్‌కు ముందే గుంటూరు కారం ఓటీటీ, థియేట్రిక‌ల్‌తో పాటు శాటిలైట్ బిజినెస్ క్లోజ్ అయిన‌ట్లు స‌మాచారం. గుంటూరు కారం ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ 50 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది.

మ‌హేష్‌బాబు
మ‌హేష్‌బాబు

Guntur Kaaram OTT Deal Price: మ‌హేష్ బాబు గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానుంది. అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ కాంబోలో రాబోతోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. గ‌త సినిమాల‌కు భిన్నంగా మాస్ యాక్ష‌న్ అంశాల‌తో త్రివిక్ర‌మ్ ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్నాడు. రిలీజ్‌కు రెండు వారాల ముందే ఈ సినిమా థియేట్రిక‌ల్‌, ఓటీటీతో పాటు శాటిలైట్ బిజినెస్ క్లోజ్ అయిన‌ట్లు స‌మాచారం.

యాభై కోట్లకు డిజిటల్ రైట్స్…

గుంటూరు కారం డిజిట‌ల్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దాదాపు యాభై కోట్ల‌కు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. గుంటూరు కారం ఓటీటీ రైట్స్‌ కోసం అన్ని ఓటీటీ సంస్థ‌లు పోటీప‌డ్డ‌ట్లు స‌మాచారం. చివ‌ర‌కు రికార్డు ధ‌ర‌కు నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న‌ట్లు తెలిసింది.

థియేట్రిక‌ల్ బిజినెస్ 120 కోట్లు…

అంతే కాకుండా మ‌హేష్ బాబు కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ థియేట్రిక‌ల్ బిజినెస్ చేసిన మూవీగా గుంటూరు కారం నిలిచిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల థియేట్రిక‌ల్ బిజినెస్ 120 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఓవ‌ర్ సీస్ థియేట్రిక‌ల్ బిజినెస్ 40 కోట్ల వ‌ర‌కు చేసిన‌ట్లు తెలిసింది. ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా గుంటూరు కారం థియేట్రిక‌ల్ బిజినెస్ 160 కోట్ల వ‌ర‌కు జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ఇక గుంటూరు కారం శాటిలైట్ హ‌క్కుల‌ను స్టార్ మా కొనుగోలు చేసిన‌ట్లు తెలిసింది.

మహేష్ న్యూ ఇయర్ ట్రిప్…

గుంటూరు కారం సినిమాలో శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవ‌లే గుంటూరు కారం షూటింగ్‌ను ముగించుకున్న మ‌హేష్‌బాబు న్యూ ఇయ‌ర్ ట్రిప్ కోసం విదేశాల‌కు వెళ్లారు. జ‌న‌వ‌రి 5 నుంచి గుంటూరు కారం రిలీజ్ ప్ర‌మోష‌న్స్‌లో మ‌హేష్ బాబు పాల్గొనున్న‌ట్లు తెలిసింది.

Whats_app_banner