తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prince Trailer: శివకార్తికేయన్ ప్రిన్స్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

Prince Trailer: శివకార్తికేయన్ ప్రిన్స్ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడొస్తుందంటే?

08 October 2022, 14:51 IST

google News
    • Sivakarthikeyan Prince Trailer: శివకార్తికేయన్ హీరోగా నటించిన ప్రిన్స్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. దీపావళి కానుకగా అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు.
ప్రిన్స్ ట్రైలర్ వచ్చేది ఆ ఆరోజే
ప్రిన్స్ ట్రైలర్ వచ్చేది ఆ ఆరోజే (Twitter)

ప్రిన్స్ ట్రైలర్ వచ్చేది ఆ ఆరోజే

Prince Trailer Release Date: కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా.. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ప్రిన్స్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, ఫస్ట్ గ్లింప్స్ విడుదలై సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్‌ను తీసుకొచ్చాయి. ఫలితంగా చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ తెరకెక్కుతోన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉక్రెయిన్ నటి ర్యాబోషప్క ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. దీంతో చిత్ర ప్రచార కార్యక్రమాలను షురూ చేసింది చిత్రబృందం. తాజాగా ప్రిన్స్ మూవీ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది.

ఈ విషయాన్ని హీరో శివకార్తికేయన్ ట్విటర్ వేదికగా తెలియజేశారు. ప్రిన్స్ ట్రైలర్‌ను అక్టోబరు 9 అంటే ఆదివారం నాడు విడుదల కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొదటి సారి తన సినిమా దీపావళికి విడుదలవుతుందని, అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతంగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాను సురేశ్ బాబు, సునీల్ నారాంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది.

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పచుకున్నారు హీరో శివకార్తికేయన్. గతేడాది డాక్టర్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న శివకార్తికేయన్.. ఈ ఏడాది డాన్ చిత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్‌ను సాధించింది. దీంతో కెరీర్ పరంగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు శివకార్తికేయన్. ప్రస్తుతం గతేడాది జాతిరత్నాలతో సూపర్ హిట్ అందుకున్న అనుదీప్ కేవీతో ప్రిన్స్ సినిమాతో బిజీగా ఉన్నారు.

తదుపరి వ్యాసం