తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rashmika Mandanna Goodbye Day 1 Collection: ర‌ష్మికకు షాక్ ఇచ్చిన బాలీవుడ్ ప్రేక్ష‌కులు

Rashmika Mandanna Goodbye Day 1 Collection: ర‌ష్మికకు షాక్ ఇచ్చిన బాలీవుడ్ ప్రేక్ష‌కులు

08 October 2022, 14:04 IST

  • Rashmika Mandanna Goodbye Day 1 Collection: ర‌ష్మిక మంద‌న్న తొలి బాలీవుడ్ చిత్రం గుడ్‌బై శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మొద‌టిరోజు ఈ సినిమాకు షాకింగ్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. 

అమితాబ్‌బ‌చ్చ‌న్, ర‌ష్మిక మంద‌న్న
అమితాబ్‌బ‌చ్చ‌న్, ర‌ష్మిక మంద‌న్న (Twitter)

అమితాబ్‌బ‌చ్చ‌న్, ర‌ష్మిక మంద‌న్న

Rashmika Mandanna Goodbye Day 1 Collection: గుడ్‌బై సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది ర‌ష్మిక మంద‌న్న‌. అమితాబ్‌బ‌చ్చ‌న్(Amitabh bachchan) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తొలిరోజు ఈ సినిమాకు షాకింగ్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. కేవ‌లం 90 ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే రాబ‌ట్టింది. టికెట్ రేట్ల‌ను త‌గ్గిస్తూ గుడ్‌బై సినిమాను రిలీజ్ చేశారు. అయినా కూడా పూర్ ఓపెనింగ్స్ రావ‌డం గ‌మ‌నార్హం.

ట్రెండింగ్ వార్తలు

Murari Movie: మురారి సినిమాలో మహేశ్‍కు జీడీగా సోనాలీ కంటే ముందు ఈ బాలీవుడ్ భామను అనుకున్నారట!

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Horror Movie: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్! ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

అమితాబ్‌బ‌చ్చ‌న్ కీల‌క పాత్రలో న‌టించ‌డం, పుష్ప సినిమాతో ర‌ష్మిక‌కు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్ప‌డ‌టంతో గుడ్‌బై మోస్తారు ఓపెనింగ్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. కానీ వారి అంచ‌నాల్ని త‌ల‌క్రిందులు చేస్తూ కోటి రూపాయ‌ల కంటే త‌క్కువ క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే ఈ సినిమా సొంతం చేసుకున్న‌ది. గుడ్‌బై సినిమాలో ర‌ష్మిక మంద‌న్న లాయ‌ర్ పాత్ర‌లో న‌టించింది.

ర‌ష్మిక తండ్రిగా హ‌రీష్ అనే పాత్ర‌లో అమితాబ్‌బ‌చ్చ‌న్ క‌నిపించాడు. భార్య మ‌ర‌ణించిన సంగ‌తిని కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌జెప్పే క్ర‌మంలో హ‌రీష్‌కు ఎదురైన అనుభ‌వాలు, మోడ్ర‌న్ రిలేష‌న్స్ షిప్స్ కార‌ణంగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ మ‌ధ్య పెరుగుతున్న దూరాన్ని ఆవిష్క‌రిస్తూ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు వికాస్ భ‌ల్ గుడ్‌బై సినిమాను తెర‌కెక్కించాడు.

క్వీన్‌, సూప‌ర్ 30 సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా ప్ర‌తిభ‌ను చాటుకున్నారు వికాస్ భ‌ల్‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా కావ‌డంతో గుడ్‌బై కోసం బాలీవుడ్ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూశారు.

మ‌రోవైపు ర‌ష్మిక మంద‌న్న గుడ్‌బైతోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా త‌ర్వాత మిష‌న్ మ‌జ్నుతో పాటు ర‌ణ్‌భీర్‌క‌పూర్‌తో క‌లిసి యానిమ‌ల్ సినిమా చేస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం