తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amaran Twitter Review: అమరన్ ట్విట్టర్ రివ్యూ - శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి మూవీ ప్రీమియ‌ర్స్‌కు పాజిటివ్ టాక్‌!

Amaran Twitter Review: అమరన్ ట్విట్టర్ రివ్యూ - శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి మూవీ ప్రీమియ‌ర్స్‌కు పాజిటివ్ టాక్‌!

31 October 2024, 5:52 IST

google News
  • Amaran Twitter Review: శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి హీరోహీరోయిన్లుగా న‌టించిన అమ‌ర‌న్ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.  క‌మ‌ల్‌హాస‌న్ నిర్మించిన ఈ మూవీకి రాజ్‌కుమార్ పెరియాసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఏంటంటే? 

అమరన్ ట్విట్టర్ రివ్యూ
అమరన్ ట్విట్టర్ రివ్యూ

అమరన్ ట్విట్టర్ రివ్యూ

Amaran Twitter Review: శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన అమ‌ర‌న్ మూవీ శుక్ర‌వారం పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో త‌మిళం, తెలుగులో పాటు మిగిలిన భాష‌ల్లో రిలీజైంది. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీని విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ప్రొడ్యూస్ చేశారు. రాజ్‌కుమార్ పెరియాసామి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సాయిప‌ల్ల‌వికి ఉన్న క్రేజ్‌తో పాటు భారీ ప్ర‌మోష‌న్స్ కార‌ణంగా అమ‌ర‌న్‌పై తెలుగులోనూ మంచి బ‌జ్ ఏర్ప‌డింది. ఈ సినిమా ప్రీమియ‌ర్స్ టాక్ ఏంటంటే?

ముకుంద్ త్యాగం...

దేశం కోసం ఆర్మీ మేజ‌ర్ ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ చేసిన త్యాగం, అస‌మాన పోరాటాన్ని అమ‌ర‌న్ మూవీలో ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ పెరియాసామి చ‌క్క‌గా చూపించాడ‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు . బ‌యోపిక్ అయినా యాక్ష‌న్, ఎమోష‌న్స్‌తో పాటు హీరోహీరోయిన్ల కెమిస్ట్రీతో ప్రాప‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ ఫీల్‌ను సినిమా చూస్తోన్న ఆడియెన్స్‌లో క‌లిగించ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడ‌ని చెబుతున్నారు.

సాయిప‌ల్ల‌వి ప్ల‌స్‌...

ఇందు రెబెకా జాన్ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి క్యారెక్ట‌ర్, యాక్టింగ్ అమ‌ర‌న్‌ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్‌పాయింట్‌గా నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తోన్నారు. శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి కాంబోలో వ‌చ్చే ప్ర‌తీ సీన్ ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తుంద‌ని అంటున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అద్భుతంగా పండిన మూవీ ఇదేన‌నే కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

ఫ‌స్ట్‌ హాఫ్‌లో ఫ్యామిలీ బాండింగ్ సీన్స్‌, వాటి నుంచి వ‌చ్చే ఫ‌న్ అల‌రిస్తుంద‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. క‌థ‌ను మొద‌లుపెట్టిన విధానం, క్యారెక్ట‌ర్ డిజైనింగ్‌లో ద‌ర్శ‌కుడు చేసిన రీసెర్చ్ ప్ర‌తి ఫ్రేమ్‌లో క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

మెచ్యూర్డ్ యాక్టింగ్‌...

ఇప్ప‌టివ‌ర‌కు శివ‌కార్తికేయ‌న్ ల‌వ‌ర్‌బాయ్‌గా, ప‌క్కింటి కుర్రాడి త‌ర‌హా సాఫ్ట్ రోల్స్ ఎక్కువ‌గా చేశాడు. వాటికి భిన్నంగా ఆర్మీ మేజ‌ర్‌ పాత్ర‌లో మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో అద‌ర‌గొట్టాడ‌ని కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

వార్ బ్యాక్‌డ్రాప్ సీన్స్‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ద‌ర్శ‌కుడు అమ‌ర‌న్ మూవీలో చూపించాడ‌ని అంటున్నారు. క్లైమాక్స్ ఎపిసోడ్ క‌న్నీళ్ల‌ను పెట్టిస్టుంద‌ని, ఆ సీన్‌లో సాయిప‌ల్ల‌వి త‌న యాక్టింగ్‌తో ఇర‌గ‌దీసింద‌ని చెబుతోన్నారు. జీవీ ప్ర‌కాష్ కుమార్ మ్యూజిక్ ఈ సినిమా ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింద‌ని చెబుతోన్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం