తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sir Records In Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో సార్ మూవీ సరికొత్త రికార్డులు

Sir Records in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో సార్ మూవీ సరికొత్త రికార్డులు

Hari Prasad S HT Telugu

21 March 2023, 16:20 IST

  • Sir Records in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో సార్ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ బైలింగ్వల్ మూవీ.. ఓటీటీలోనూ తన మార్క్ చూపిస్తోంది.

సార్ మూవీలో ధనుష్
సార్ మూవీలో ధనుష్

సార్ మూవీలో ధనుష్

Sir Records in Netflix: తమిళ స్టార్ హీరో ధనుష్ 2023లో నటించిన తొలి మూవీ సార్. తెలుగుతోపాటు తమిళంలోనూ వాతి పేరుతో రిలీజైన ఈ సినిమా ఈ ఏడాది సక్సెస్‌ఫుల్ సినిమాల్లో ఒకటి. ఫిబ్రవరి 17న థియేటర్లలో రిలీజైన సార్ మూవీ.. భారీ కలెక్షన్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర రూ.118 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Premalu Telugu OTT: ఓటీటీలో మరో మైల్‍స్టోన్ దాటిన ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

Manjummel Boys OTT: ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే!

వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ రికార్డులు కొల్లగొడుతోంది. ఈ ఓటీటీలో గత శుక్రవారం (మార్చి 18) నుంచి సార్ మూవీ స్ట్రీమ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీల్లోనూ రిలీజైందీ సినిమా. అయితే నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్స్ లో తమిళ వెర్షన్ నంబర్ వన్ కాగా తెలుగు, హిందీ వెర్షన్లు రెండు, మూడు స్థానాల్లో ఉండటం విశేషం.

ఈ సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ఈ సార్ మూవీ ఇండియాలోనే కాకుండా బహ్రెయిన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, కువైట్, మలేసియా, మాల్దీవ్స్, మారిషన్, ఒమన్, సింగపూర్, ఖతార్, శ్రీలంక, యూఏఈల్లోనూ ట్రెండింగ్ లో ఉంది. నిజానికి ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్లు కూడా లేవు. అయినా సినిమా మాత్రం ప్రేక్షకులను బాగా అలరించింది.

దీంతో ధనుష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ అందించిన మ్యూజిక్ కూడా హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా తెలుగులో మాస్టారు మాస్టారు పాట ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ధనుష్ తనదైన రీతిలో నటించిన ఈ సార్ మూవీ ఓటీటీలోనూ దూసుకెళ్తోంది.

ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న రెండో మూవీ ఈ వాతి. ఇంతకు ముందు అజిత్ నటించిన తునివు కూడా మంచి టాక్ కొట్టేసింది. ఈ సార్ మూవీలో ధనుష్ తోపాటు సంయుక్త, తనికెళ్ల భరణి, సాయి కుమార్, సముద్రఖని, సుమంత్ నటించారు. సార్ మూవీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంతకుముందు డిలీట్ చేసిన ఓ సీన్, బిహైండ్ ద స్క్రీన్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.