Sir Streaming on Netflix: థియేట‌ర్ల‌లో ఆడుతుండ‌గానే ఓటీటీలోకి వ‌చ్చేసిన సార్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే -dhanush sir movie streaming now on netflix ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dhanush Sir Movie Streaming Now On Netflix

Sir Streaming on Netflix: థియేట‌ర్ల‌లో ఆడుతుండ‌గానే ఓటీటీలోకి వ‌చ్చేసిన సార్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Mar 17, 2023 09:14 AM IST

Sir Streaming Now Netflix: ధ‌నుష్ సార్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది. ఈ సూప‌ర్ హిట్ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే...

ధ‌నుష్
ధ‌నుష్

Sir Streaming Now Netflix: ధ‌నుష్ (Dhanush) సార్ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని ద‌క్కించుకున్న‌ది. బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసింది. శుక్ర‌వారం నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు త‌మిళ (వాతి పేరుతో రిలీజ్‌) వెర్ష‌న్స్ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు ద‌క్కించుకున్న‌ది.

ప్ర‌స్తుతం తెలుగు తోపాటు త‌మిళంలో ప‌లు థియేట‌ర్ల‌లో ఈ సినిమా ఆడుతోంది. థియేట‌ర్ల‌లో న‌డుస్తుండ‌గానే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రెండు భాష‌ల్లో శుక్ర‌వారం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. విద్యా వ్య‌వ‌స్థ గొప్ప‌త‌నాన్ని చాటిచెబుతూ తెర‌కెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లోని విద్యా ప్ర‌మాణాల్ని దిగ‌జార్చి కార్పొరేట్ క‌ల్చ‌ర్‌ను పెంపొందించ‌డానికి ప్ర‌య‌త్నించిన కొంద‌రికి ఓ లెక్చ‌ర‌ర్ ఎలా బుద్దిచెప్పాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

ఇందులో బాల గంగాధ‌ర్ తిల‌క్ అనే లెక్చ‌ర‌ర్‌గా ధ‌నుష్ అస‌మాన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. ధ‌నుష్‌కు జోడీగా సంయుక్త హీరోయిన్‌గా న‌టించింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొందిన ఈ సినిమా రెండు భాష‌ల్లో క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.

వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. రెండు భాష‌ల్లో క‌లిపి నిర్మాత‌ల‌కు 25 కోట్ల‌కుపైగా లాభాల‌ను మిగిల్చిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని విల‌న్‌గా న‌టించ‌గా హైప‌ర్ ఆది కీల‌క పాత్ర‌ను పోషించాడు

IPL_Entry_Point