Sir Movie Collection Day 1: సార్ మూవీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - ధ‌నుష్ తెలుగు రిలీజ్‌ల‌లో ఇదే హ‌య్యెస్ట్‌-sir movie first day collection dhanush movie telugu and tamil collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sir Movie First Day Collection Dhanush Movie Telugu And Tamil Collection

Sir Movie Collection Day 1: సార్ మూవీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - ధ‌నుష్ తెలుగు రిలీజ్‌ల‌లో ఇదే హ‌య్యెస్ట్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 18, 2023 12:19 PM IST

Sir Movie Collection Day 1: సార్ సినిమా తెలుగులో ధ‌నుష్ కెరీర్‌లో ఫ‌స్ట్ డే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది. శుక్ర‌వారం ఈ సినిమాకు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ ఎంతంటే...

ధ‌నుష్
ధ‌నుష్

Sir Movie Collection Day 1: ధ‌నుష్ హీరోగా న‌టించిన సార్ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అధిక ఫీజుల‌తో దిగువ‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌ను చ‌దువుకు దూరం చేస్తోన్న విద్యా వ్య‌వ‌స్థ‌పై ఓ సాధార‌ణ లెక్చ‌ర‌ర్ సాగించే పోరాటంతో ఈ సినిమా తెర‌కెక్కింది. మెసేజ్ ఓరియెంటెడ్ క‌థాంశంతో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను రూపొందించాడు.

తెలుగులో సార్‌ సినిమా తొలిరోజు దాదాపు నాలుగున్నర కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగులో ధ‌నుష్ కెరీర్‌లో తొలిరోజు అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాగా సార్ నిలిచింది. నైజాం ఏరియాలో ఈ సినిమాకు కోటి ప‌ది ల‌క్ష‌ల‌కుపైగా వ‌సూళ్లు వ‌చ్చిన‌ట్లు తెలిసింది. ఉత్త‌రాంధ్ర‌లో 33 ల‌క్ష‌లు, సీడెడ్‌లో 31 ల‌క్ష‌ల వ‌ర‌కు తెలుగు వెర్ష‌న్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది.

ఓవ‌రాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా నాలుగున్న‌ర కోట్ల గ్రాస్‌ను రెండు కోట్లముప్పై ల‌క్ష‌లకుపైగా షేర్‌ను రాబ‌ట్టిన‌ట్లు తెలిసింది. రీసెంట్ టైమ్‌లో రిలీజైన డ‌బ్బింగ్ సినిమాల్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా సార్ నిలిచింది. ఈ సినిమా త‌మిళంలో వాతి పేరుతో శుక్ర‌వారం రిలీజైంది.

త‌మిళ వెర్ష‌న్ తొలిరోజు 7.5 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమాలో బాల‌గంగాధ‌ర్ తిల‌క్ అనే లెక్చ‌ర‌ర్‌గా ధ‌నుష్ యాక్టింగ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. సంయుక్త హీరోయిన్‌గా న‌టించ‌గా స‌ముద్ర‌ఖ‌ని విల‌న్‌గా న‌టించాడు.

IPL_Entry_Point