తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Silk Smitha: ఐటమ్ సాంగ్‍కు అడ్వాన్స్ అరేంజ్ చేసిన మరుసటి రోజే సిల్క్ స్మిత చనిపోయారు: ఆనంద్ రాజ్

Silk Smitha: ఐటమ్ సాంగ్‍కు అడ్వాన్స్ అరేంజ్ చేసిన మరుసటి రోజే సిల్క్ స్మిత చనిపోయారు: ఆనంద్ రాజ్

25 July 2024, 12:24 IST

google News
    • Anand Raj on Silk Smitha: సిల్క్ స్మిత మరణాన్ని నటుడు ఆనంద్ రాజా గుర్తు చేసుకున్నారు. ఓ ఐటమ్ సాంగ్ కోసం అడ్వాన్స్ తీసుకున్న మరుసటి రోజే ఆమె షాకింగ్‍గా మృతి చెందారని అన్నారు. మరిన్ని విషయాలను వెల్లడించారు.
Silk Smitha: ఐటమ్ సాంగ్‍కు అడ్వాన్స్ అరేంజ్ చేసిన మరుసటి రోజే సిల్క్ స్మిత చనిపోయారు: ఆనంద్ రాజ్
Silk Smitha: ఐటమ్ సాంగ్‍కు అడ్వాన్స్ అరేంజ్ చేసిన మరుసటి రోజే సిల్క్ స్మిత చనిపోయారు: ఆనంద్ రాజ్

Silk Smitha: ఐటమ్ సాంగ్‍కు అడ్వాన్స్ అరేంజ్ చేసిన మరుసటి రోజే సిల్క్ స్మిత చనిపోయారు: ఆనంద్ రాజ్

అలనాటి తార సిల్క్ స్మిత ఓ సంచలనం. 1980ల నుంచి సుమారు పదిహేనేళ్లు సినీ ఇండస్ట్రీలను ఊపేశారు. తన గ్లామర్, డ్యాన్స్‌, గ్రేస్‍తో ఆకట్టుకున్నారు. ఎన్నో సినిమాలు హిట్ అయ్యేందుకు కారణమయ్యారు. తన కెరీర్లో సిల్క్ స్మిత ఎక్కువగా ఐటమ్స్ సాంగ్స్ చేశారు. ఆమె అందం, డ్యాన్స్ అంటే ప్రేక్షకులు అమితంగా ఇష్టడేవారు. వివిధ సినీ ఇండస్ట్రీల్లోని చాలా మంది స్టార్ హీరోతోనూ సిల్క్ చిందేశారు. 400లకు పైగా సినిమాల్లో చేశారు. ఆంధ్రలోని మూరుమాల ప్రాంతం నుంచి వచ్చి అప్పట్లోనే దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అయితే, 1996లో హఠాత్తుగా సిల్క్ స్మిత మరణించగా.. అది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే, సిల్క్ స్మిత మృతిపై తాజాగా కొన్ని విషయాలు చెప్పారు నటుడు ఆనంద్ రాజ్.

చాలా షాకయ్యా

ఓ మూవీలో ఐటెమ్ సాంగ్ కోసం అడ్వాన్స్ అరేంజ్ చేసిన తర్వాతి రోజే సిల్క్ స్మిత చనిపోయారని, సడెన్‍గా ఇది జరగడంతో చాలా షాక్ అయ్యానని ఆనంద్ రాజ్ చెప్పారు. అప్పట్లో సిల్క్, ఆనంద్ స్నేహితులుగా ఉండేవారు. “అప్పుడు నేను ఓ కన్నడ సినిమాలో నటిస్తున్నా. విలన్‍గా చేస్తున్నారు. మూవీలో ఐటమ్ డ్యాన్స్ చేసేందుకు ఎవరినైనా తీసుకోవాలని ఆ మూవీ టీమ్ వారు ఆలోచించారు. అప్పుడు నేను సిల్క్ స్మిత పేరును చెప్పా. ఆమెకు అడ్వాన్స్ పేమెంట్ కూడా అరేంజ్ చేశా. అయితే, దురదృష్టవశాత్తు ఆమె ఆ తర్వాతి రోజే మృతి చెందారు. నేను చాలా షాకయ్యా” అని ఆనంద్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

సిల్క్ స్మితకు సినిమాలే అంతా అని ఆనంద్ రాజ్ అన్నారు. ఆమె మరణ వార్త విని తాము స్టన్ అయ్యామని తెలిపారు. “ఆమె మరణవార్త విని సెట్‍లోని మేమంతా స్టన్ అయ్యాం. మేం షూటింగ్ కూడా అప్పుడు ఆపేశాం. ఆ తర్వాత ఆ పాత్రను అల్ఫోన్సా తీసుకున్నారు. సిల్క్ స్మితకు సినిమాలే అంతా. కానీ ఆమె మిస్టరీ మరణం అందరినీ షాక్‍కు గురి చేసింది” అని ఆనంద్ రాజ్ తెలిపారు.

నన్ను సంప్రదించాల్సింది

స్మిల్క్ స్మిత జీవితంపై బాలీవుడ్‍లో ‘ది డర్టీ పిక్చర్’ అనే మూవీ తెరకెక్కింది. ఆ చిత్రంలో సిల్క్ పాత్రను విద్యాబాలన్ పోషించారు. అయితే, ఆ మూవీ తీసేటప్పుడు తనను సంప్రదించి ఉంటే మరిన్ని వివరాలు చెప్పేవాడనని ఆనంద్ రాజ్ అన్నారు. “సినిమా రూపొందించే సమయంలో వారు నన్ను సంప్రదించి ఉంటే చాలా విషయాలు చెప్పేవాడిని. అవి ఆ చిత్రానికి ప్రయోజనకరంగా ఉండేవి. ఆ చిత్రంలో ఆమెకు సంబంధించిన కొన్ని విషయాలు చూపించారు. చెప్పాల్సినవి చాలా ఉన్నాయి” అని ఆనంద్ రాజ్ తెలిపారు.

సిల్క్ స్మిత జీవితంపై మరో సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి జయరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సిల్క్ పాత్రను చంద్రిక రవి పోషిస్తున్నారు. అన్‍టోర్డ్ స్టోరీ అంటూ ఇంతకు సిల్క్ స్మిత గురించి బయటికి రాని కొన్ని విషయాలను ఈ మూవీలో చెబుతామని మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ మూవీ ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం