సినిమాలో పాత్ర కోసం శరీరాన్ని భారీగా మార్చుకున్న 10 మంది నటీనటులు.. ఆమిర్ ఖాన్ నుంచి విద్యాబాలన్ వరకు..-aamir khan to vidya baalan 10 actors who underwent dramatic physical transformation for movies ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  సినిమాలో పాత్ర కోసం శరీరాన్ని భారీగా మార్చుకున్న 10 మంది నటీనటులు.. ఆమిర్ ఖాన్ నుంచి విద్యాబాలన్ వరకు..

సినిమాలో పాత్ర కోసం శరీరాన్ని భారీగా మార్చుకున్న 10 మంది నటీనటులు.. ఆమిర్ ఖాన్ నుంచి విద్యాబాలన్ వరకు..

Jun 11, 2024, 04:44 PM IST Chatakonda Krishna Prakash
Jun 11, 2024, 04:44 PM , IST

సినిమాలో తమ పాత్ర కొందరు నటులు ప్రాణం పెట్టేస్తారు. ఎంతో శ్రమించి పాత్రకు తగ్గట్టు తమ శరీరాలను మార్చుకుంటారు. అలా గతంలో భారీగా ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయిన 10 మంది నటీనటుల గురించి ఇక్కడ చూడండి.  

దంగల్ చిత్రంలో వయసైన వ్యక్తి పాత్ర కోసం భారీగా బరువు పెరిగారు హీరో ఆమిర్ ఖాన్. ఆ సినిమాలోనే యంగ్ లుక్ కోసం ఆ తర్వాత 28 కేజీల బరువు తగ్గారు. 

(1 / 10)

'ఆడుజీవితం - ది గోట్‍లైఫ్' సినిమా కోసం మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ఏకంగా 31 కేజీల బరువు తగ్గారు. శరీరాన్ని చాలా మార్చుకున్నారు. 

(2 / 10)

తషన్ మూవీలో జీరో సైజ్ కోసం కరీనా కపూర్ చాలా బరువు తగ్గారు. అప్పట్లో ఈమె జోరో సైజ్‍కు చాలా క్రేజ్ వచ్చింది. 

(3 / 10)

సుల్తాన్ చిత్రం కోసం సల్మాన్ ఖాన్ ముందుగా భారీగా బరువు పెరిగారు. అయితే, రెజ్లర్ లుక్ కోసం మళ్లీ బరువు తగ్గారు. 

(4 / 10)

భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ బయోపిక్ సినిమా కోసం ప్రియాంక చోప్రా ఏడునెలల పాటు తీవ్రంగా శ్రమించి.. కండలు పెంచారు. తన శరీరాన్ని చాలా ట్రాన్స్‌ఫామ్ చేశారు. 

(5 / 10)

ది డర్టీ పిక్చర్ చిత్రంలో సిల్క్ స్మిత పాత్ర కోసం హీరోయిన్ విద్యా బాలన్ ఏకంగా 12 కేజీల బరువు పెరిగారు. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను జాతీయ అవార్డు వచ్చింది. 

(6 / 10)

గుజారిష్ సినిమాలో పక్షవాతం వచ్చిన పాత్ర కోసం హృతిక్ రోషన్ చాలా బరువు తగ్గారు. ఈ మూవీ అంతా వీల్‍చైర్‌లోనే హృతిక్ కనిపించారు. 

(7 / 10)

ట్రాప్డ్ సినిమా కోసం రాజ్‍కుమార్ రావ్ కేవలం 22 రోజుల్లోనే 7 కిలోల బరువు తగ్గారు. ఇందుకోసం ఆయన రోజులో కేవలం కాఫీ, ఓ క్యారెట్ మాత్రమే తినేవారట. 

(8 / 10)

బాగ్ మిల్కా బాగ్ సినిమాలో భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్ పాత్ర కోసం ఫర్హాన్ అక్తర్ ఏకంగా 18 నెలలు కష్టపడి.. తన శరీరాన్ని సిద్ధం చేసుకున్నారు. 

(9 / 10)

స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రం కోసం రణ్‍దీప్ హుడా ఏకంగా 32 కేజీల బరువు తగ్గారు. 

(10 / 10)

స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రం కోసం రణ్‍దీప్ హుడా ఏకంగా 32 కేజీల బరువు తగ్గారు. 

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు