Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్‍పై ప్రకటన.. ఆమె క్యారెక్టర్‌లో ఎవరంటే!-silk smitha biopic officially announced chandrika ravi to play in her role ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్‍పై ప్రకటన.. ఆమె క్యారెక్టర్‌లో ఎవరంటే!

Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్‍పై ప్రకటన.. ఆమె క్యారెక్టర్‌లో ఎవరంటే!

Silk Smitha Biopic: సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుంది. ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. నేడు (డిసెంబర్ 2) సిల్క్ స్మిత జయంతి రోజున అనౌన్స్‌మెంట్ వచ్చింది.

Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్‍పై ప్రకటన.. ఆమె క్యారెక్టర్‌లో ఎవరంటే!

Silk Smitha Biopic: భారత సినీ ఇండస్ట్రీలోనే ఒకానొక గ్రేట్ డ్యాన్సర్‌గా, నటిగా దివంగత స్మిల్క్ స్మిత నిలిచిపోయారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సహా మరిన్ని భాషల్లో ఆమె నటించారు. 400 సినిమాలకు పైగా చేశారు. ఎక్కువగా మూవీల్లో స్పెషల్ పాటలు, రొమాంటిక్ క్యారెక్టర్లు చేశారు. ఒకే సంవత్సరంలో ఎక్కువ సినిమాల్లో కనిపించిన రికార్డు కూడా ఆమె పేరిట ఉంది. 1979 నుంచి సుమారు 17 ఏళ్ల పాటు సిల్క్ స్మిత జోరు కొనసాగింది. అంతటి స్టార్ డమ్ చూసిన ఆమె 1996లో ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, ఇప్పుడు సిల్క్ స్మిత జీవితంపై మరో బయోపిక్ తెరకెక్కనుంది.

నేడు (డిసెంబర్ 2) సిల్క్ స్మిత 63వ జయంతి సందర్భంగా ఆమె బయోపిక్ మూవీపై అధికారిక ప్రకటన వచ్చింది. సిల్క్ స్మిత పాత్రలో చంద్రిక రవి నటించనున్నారు. వీరసింహా రెడ్డి మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన చంద్రిక.. ఇప్పుడు సిల్క్ స్మిత క్యారెక్టర్ చేయనున్నారు. సిల్క్ స్మితగా చంద్రిక ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ యూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి అన్‍టోల్డ్ స్టోరీ అనే క్యాప్షన్ ఉంది.

సిల్క్ స్మిత బయోపిక్ సినిమాకు జయరామ్ దర్శకత్వం వహించనున్నారు. ఎస్‍బీ విజయ్ నిర్మించనున్నారు. వచ్చే ఏడాది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ పేర్కొంది.

సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగిన సిల్క్ స్మిత ఎన్నో ఒడిదొడుకులను, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 35 ఏళ్ల వయసులోనే 1996లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె ఆత్మహత్యకు కారణాలేంటో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

సిల్క్ స్మిత జీవితంపై బాలీవుడ్‍లో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో ఇప్పటికే ‘డర్టీ పిక్చర్’ వచ్చింది. ఇప్పుడు ఆమె బయోపిక్‍గా మరో మూవీ రూపొందనుంది.