తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manamey Ott: మనమే సినిమా ఓటీటీ ఆలస్యానికి కారణం చెప్పిన నిర్మాత.. మోసం వల్లే అంటూ..

Manamey OTT: మనమే సినిమా ఓటీటీ ఆలస్యానికి కారణం చెప్పిన నిర్మాత.. మోసం వల్లే అంటూ..

24 August 2024, 15:09 IST

google News
    • Manamey OTT Release: మనమే సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోంది. అయితే, ఎందుకు స్ట్రీమింగ్‍కు రావడం లేదనే విషయం ఇప్పటి వరకు సందిగ్ధంగానే మిగిలింది. అయితే, ఈ అంశంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడారు. స్ట్రీమింగ్‍కు రావడం ఎందుకు ఆలస్యమవుతోందో వివరించారు.
Manamey OTT: మనమే సినిమా ఓటీటీ ఆలస్యానికి కారణం చెప్పిన నిర్మాత.. మోసం వల్లే అంటూ..
Manamey OTT: మనమే సినిమా ఓటీటీ ఆలస్యానికి కారణం చెప్పిన నిర్మాత.. మోసం వల్లే అంటూ..

Manamey OTT: మనమే సినిమా ఓటీటీ ఆలస్యానికి కారణం చెప్పిన నిర్మాత.. మోసం వల్లే అంటూ..

బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కొన్ని సినిమాలు ఓటీటీలోకి రావడం ఇటీవల ఆలస్యమవుతోంది. ఓటీటీ హక్కుల విషయంలో సందిగ్ధత సహా మరిన్ని కారణాలతో స్ట్రీమింగ్‍కు రావడంలో జాప్యం జరుగుతోంది. శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మనమే సినిమా కూడా ఇదే కోవలోకి వచ్చింది. మంచి అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ఆలస్యమవుతోంది.

మనమే సినిమా జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఈ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మొదటి నుంచే మిక్స్డ్ టాక్‍తో కలెక్షన్లను ఆశించిన స్థాయిలో తెచ్చుకోలేకపోయింది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. కానీ ఆలస్యమవుతూ వస్తోంది. అయితే, మనమే సినిమా స్ట్రీమింగ్‍కు రావడం ఎందుకు లేట్ అవుతోందో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

మోసపోయాం

మనమే సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో తాము మోసపోయామని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. ఓ సంస్థకు తాము ఈ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు ఇచ్చామని, అయితే ఆ సంస్థ వివిధ కారణాలు చెబుతూ ఏ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍కు ఈ సినిమా హక్కులను అమ్మలేదని ఆయన తెలిపారు. దీని వల్ల తమకు భారీగా నష్టం వచ్చిందని తెలిపారు. ఈ కారణంగానే మనమే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమవుతోంది.

కోర్టులో కేసు

మనమే సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను తీసుకున్న వ్యక్తులు తమకు డబ్బు చెల్లించలేదని నిర్మాత విశ్వప్రసాద్ వెల్లడించారు. దీని వల్ల తమకు 60 నుంచి 70 శాతం నష్టం వచ్చిందని వెల్లడించారు. ఈ మోసంపై తాము కోర్టును కూడా ఆశ్రయించామని ఆయన తెలిపారు. కేసు వేశామని అన్నారు. తాము నాన్ థియేట్రికల్ హక్కులను ఇచ్చిన వ్యక్తులు.. ఇతర సినిమాలను ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లకు అమ్ముతూ మనమే మూవీని మాత్రం హోల్డ్ చేస్తున్నారని విశ్వప్రసాద్ అన్నారు.

మనమే సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకున్నట్టు మొదట్లో రూమర్లు వచ్చాయి. అయితే, అసలు ఓటీటీ డీల్ జరగలేదని నిర్మాత విశ్వప్రసాద్ ఇప్పుడు చెబుతున్నారు. దీంతో మనమే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 26నే ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వస్తుందని రూమర్లు వస్తున్నా.. అప్పటికల్లా ఈ వివాదం సద్దుమణిగేలా లేదు. మరింత ఆలస్యం కావొచ్చు.

మనమే సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. శర్వానంద్, కృతి శెట్టితో పాటు బాలనటుడు విక్రమ్ ఆదిత్య ప్రధాన పాత్ర పోషించారు. వీరి ముగ్గురి చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, శివ కందుకూరి కీరోల్స్ చేశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం