Manamey Fourth Single: మనమే మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ బూమ్ బూమ్ వచ్చేసింది.. స్టెప్పులేయించేలా సాంగ్-manamey fourth single boom boom now out sharwanand krithi shetty movie manamey songs ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manamey Fourth Single: మనమే మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ బూమ్ బూమ్ వచ్చేసింది.. స్టెప్పులేయించేలా సాంగ్

Manamey Fourth Single: మనమే మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ బూమ్ బూమ్ వచ్చేసింది.. స్టెప్పులేయించేలా సాంగ్

Hari Prasad S HT Telugu
Published Jun 06, 2024 06:30 PM IST

Manamey Fourth Single: మనమే మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ బూమ్ బూమ్ వచ్చేసింది. శర్వానంద్, కృతి శెట్టి నటిస్తున్న మనమే మూవీ రేపే (జూన్ 7) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

మనమే మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ బూమ్ బూమ్ వచ్చేసింది.. స్టెప్పులేయించేలా సాంగ్
మనమే మూవీ నుంచి ఫోర్త్ సింగిల్ బూమ్ బూమ్ వచ్చేసింది.. స్టెప్పులేయించేలా సాంగ్

Manamey Fourth Single: శర్వానంద్, కృతి శెట్టి నటిస్తున్న మనమే సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ బూమ్ బూమ్ అంటూ వచ్చింది. ఈ లిరికల్ సాంగ్ ను గురువారం (జూన్ 6) రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన తొలి మూడు సింగిల్స్ తోపాటు ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడీ ఫోర్త్ సింగిల్ కూడా స్టెప్పులేయించేలా ఉంది.

బూమ్ బూమ్ సాంగ్

బూమ్ బూమ్ అంటూ సాగిపోయింది ఈ మనమే ఫోర్త్ సింగిల్. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 7) రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బుధవారం గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇక ఇప్పుడు మూవీ రిలీజ్ కు ఒక రోజు ముందు బూమ్ బూమ్ అనే సాంగ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఖుషీ మూవీ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించగా.. హేమచంద్ర ఈ పాట పాడాడు. భాస్కరభట్ల లిరిక్స్ అందించాడు. మొదటి మూడు పాటల్లాగే ఈ సాంగ్ కూడా ఆకట్టుకునేలానే ఉంది. ఈ పార్టీ సాంగ్ లో శర్వా తనదైన స్టెప్పులతో అలరించాడు.

మనమే మూవీ గురించి..

గ‌త సినిమాల రిజ‌ల్ట్‌ల‌తో సంబంధం లేకుండా మ‌న‌మే మూవీ థియేట్రిక‌ల్ బిజినెస్ భారీగా జ‌రిగింది. మ‌న‌మే వ‌ర‌ల్డ్ వైడ్ థ్రియేట్రిక‌ల్ హ‌క్కులు దాదాపు 11.50 కోట్ల‌కు అమ్ముడుపోయాయి. నైజాంలో అత్య‌ధికంగా3.50 కోట్ల వ‌ర‌కు ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

తెలుగు రాష్ట్రాల థియేట్రిక‌ల్ హ‌క్కులు ద్వారా నిర్మాత‌ల‌కు ప‌ది కోట్ల వ‌ర‌కు డ‌బ్బులు వ‌చ్చిన‌ట్లు చెబుతోన్నారు. ఓవ‌ర్‌సీస్‌లో కోటిన్న‌ర‌కు థియేట్రిక‌ల్ రైట్స్ అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు చెబుతోన్నారు. మొత్తంగా 11.50 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ్గా.. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజ్ అవుతోన్న‌ట్లు చెబుతోన్నారు.

కాస్త ఎక్కువ రన్ టైమే..

మనమే సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ సినిమా రన్‍టైమ్ 2 గంటల 35 నిమిషాలు (155 నిమిషాలు) ఉండనుందని తెలుస్తోంది. కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీకి ఇది కాస్త ఎక్కువ రన్‍టైమే. సాధారణంగా ఈ జానర్లో వచ్చే చిత్రాలు ఎక్కువగా 135 నిమిషాలలోపు ఉంటాయి.

మనమే సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఇటీవలే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు శర్వానంద్ చెప్పారు. ఈ మూవీపై చాలా నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీ చూశామని అందరూ ఫీలవుతారని అన్నారు.

మనమే సినిమా కథ కొత్తగా ఉందని తాను చెప్పనని, కానీ కచ్చితంగా అందరికీ మంచి ఫీల్ ఇస్తుందని శర్వానంద్ చెప్పారు. ఇంత మంచి సినిమా చూసి ఎంతకాలమైందని ప్రేక్షకులు అనుకుంటారని అన్నారు. మూవీ ఫలితాన్ని తాను బాధ్యతగా తీసుకుంటానని శర్వానంద్ తెలిపారు.

ఇక నుంచి బాగున్నా, బాగోలేకపోయినా తన సినిమాలకు తానే బాధ్యత తీసుకుంటానని శర్వానంద్ అన్నారు. ఈసారి హిట్ కొట్టాల్సిందేనని, అందరినీ ఇబ్బంది పెట్టి గొడవలతో ఈ చిత్రం చేశామని శర్వా తెలిపారు.

Whats_app_banner