Manamey: కాస్త ఎక్కువ రన్‍టైన్‍తో వస్తున్న మనమే.. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఫస్ట్ సినిమా అంటూ శర్వానంద్ ప్రమోషనల్ వీడియో-manamey movie censor completed run time locked sharwanand kriti shetty says this is first movie after elections results ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manamey: కాస్త ఎక్కువ రన్‍టైన్‍తో వస్తున్న మనమే.. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఫస్ట్ సినిమా అంటూ శర్వానంద్ ప్రమోషనల్ వీడియో

Manamey: కాస్త ఎక్కువ రన్‍టైన్‍తో వస్తున్న మనమే.. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఫస్ట్ సినిమా అంటూ శర్వానంద్ ప్రమోషనల్ వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jun 05, 2024 04:44 PM IST

Manamey Movie: శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమా రన్‍టైమ్ రివీల్ అయింది. ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి శర్వా, కృతి చేసిన ఓ ప్రమోషనల్ వీడియో ఆకట్టుకుంటోంది.

Manamey: కాస్త ఎక్కువ రన్‍టైన్‍తో వస్తున్న మనమే.. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఫస్ట్ సినిమా అంటూ శర్వానంద్ ప్రమోషనల్ వీడియో 
Manamey: కాస్త ఎక్కువ రన్‍టైన్‍తో వస్తున్న మనమే.. ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఫస్ట్ సినిమా అంటూ శర్వానంద్ ప్రమోషనల్ వీడియో 

Manamey Movie: మనమే సినిమా రిలీజ్ సమీపిస్తోంది. ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీ మరో రెండు రోజుల్లో అంటే జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మనమే చిత్రానికి శ్రీరామ్ ఆదిత్యం దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ బాగుండటంతో మూవీపై ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. రన్‍టైమ్ వివరాలు కూడా బయటికి వచ్చాయి.

రన్‍టైమ్ ఇదే..

మనమే సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఈ సినిమా రన్‍టైమ్ 2 గంటల 35 నిమిషాలు (155 నిమిషాలు) ఉండనుందని తెలుస్తోంది. కామెడీ ఫ్యామిలీ డ్రామా మూవీకి ఇది కాస్త ఎక్కువ రన్‍టైమే. సాధారణంగా ఈ జానర్లో వచ్చే చిత్రాలు ఎక్కువగా 135 నిమిషాలలోపు ఉంటాయి.

మనమే సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఇటీవలే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍కు శర్వానంద్ చెప్పారు. ఈ మూవీపై చాలా నమ్మకాన్ని వ్యక్తం చేశారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి మూవీ చూశామని అందరూ ఫీలవుతారని అన్నారు.

నేడే ప్రీ-రిలీజ్ ఈవెంట్

మనమే సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే (జూన్ 5) జరగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‍‍లోని హయత్ హోటల్‍లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‍కు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హాజరుతారంటూ ముందుగా కొన్ని రూమర్లు వచ్చాయి. అయితే, చరణ్ రావడం లేదు. మాస్ మహారాజ రవితేజ వస్తారని సమాచారం బయటికి వచ్చింది. ఈ విషయంపై కూడా క్లారిటీ రాలేదు.

శర్వా, కృతి ప్రమోషనల్ వీడియో

డేట్ చెప్పకుండా మనమే రిలీజ్ గురించి చెప్పారు శర్వానంద్, కృతి శెట్టి. ఐపీఎల్ పూర్తయిన 11 రోజులకు అని కృతి అంటే.. ప్రభాస్ అన్న కల్కి సినిమాకు 20 రోజుల ముందు అని శర్వా చెప్పారు. ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత వస్తున్న మొదటి సినిమా అని శర్వా చెబితే.. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‍కు రెండు రోజుల ముందు అని కృతి చెప్పారు. జూన్ 7న మనమే రిలీజ్ కానుందంటూ ఇలా ఫన్నీగా ఈ ప్రమోషనల్ వీడియో చేశారు.

మనమే చిత్రంలో శర్వా, కృతి హీరోహీరోయిన్లుగా చేయగా.. విక్రమ్ ఆదిత్య పిల్లాడిగా నటించారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కుమారుడే ఈ విక్రమ్ ఆదిత్య. ఈ మూవీలో సీరత్ కపర్, వెన్నెల కిశోర్, ఆయేషా ఖాన్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ ముఖ్యమైన పాత్రలు చేశారు.

మనమే మూవీకి హేషబ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. మ్యూజిక్ ఈ మూవీకి పెద్దబలం అని డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చెప్పారు. ఈ చిత్రంలో మొత్తంగా 16 పాటలు ఉంటాయని చెప్పి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో ఆశ్చర్యపరిచారు. అయితే, వీటిలో చాలా బిట్ సాంగ్స్ ఉండొచ్చు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా ఉన్నారు.

జూన్ 7న మనమే సినిమాతో పాటు కాజల్ ‘సత్యభామ’, నవదీప్ ‘లవ్ మౌళి’, పాయర్ రాజ్‍పుత్ ‘రక్షణ’ కూడా రానున్నాయి.

Whats_app_banner