తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shah Rukh Khan David Beckham: డేవిడ్ బెక్‌హామ్‌తో షారుక్ ఖాన్.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫొటో

Shah Rukh Khan David Beckham: డేవిడ్ బెక్‌హామ్‌తో షారుక్ ఖాన్.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఫొటో

Hari Prasad S HT Telugu

17 November 2023, 22:22 IST

google News
    • Shah Rukh Khan David Beckham: ఇంగ్లండ్ ఫుట్‌బాల్ లెజెండ్ డేవిడ్ బెక్‌హామ్‌తో బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ కలిసి దిగిన ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ ఫొటోని షారుక్ షేర్ చేశాడు.
డేవిడ్ బెక్‌హామ్ తో షారుక్ ఖాన్
డేవిడ్ బెక్‌హామ్ తో షారుక్ ఖాన్

డేవిడ్ బెక్‌హామ్ తో షారుక్ ఖాన్

Shah Rukh Khan David Beckham: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ ‌బెక్‌హామ్ తో దిగిన ఫొటో మొత్తానికి బయటకు వచ్చింది. మొన్న ఇండియా, న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ చూడటానికి వచ్చిన బెక్‌హామ్.. బాలీవుడ్ సెలబ్రిటీలందరితోనూ ఫొటోలకు పోజులిచ్చాడు.

తాజాగా గురువారం (నవంబర్ 16) రాత్రి షారుక్ ఖాన్ ఇచ్చిన పార్టీకి బెక్‌హామ్ వెళ్లాడు. ఈ సందర్భంగా అతనితో కలిసి దిగిన ఫొటోను షారుక్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా బెక్‌హామ్ ను ఓ ఐకాన్ గా కింగ్ ఖాన్ అభివర్ణించాడు. "ఓ ఐకాన్ తో చివరి రాత్రి.. అతడో అసలు సిసలు జెంటిల్మన్. అతన్ని నేనెప్పుడూ అభిమానించే వాడిని.

కానీ అతన్ని వ్యక్తిగతంగా కలవడం, అతడు పిల్లలతో ఉన్న తీరు చూసిన తర్వాత బెక్‌హామ్ ఫుట్‌బాల్ కంటే కూడా అతని దయాగుణం, మృదు స్వభావం బాగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడూ సంతోషంగా ఉండు. బాగా నిద్రపో" అనే క్యాప్షన్ తో షారుక్ ఈ ఫొటో షేర్ చేశాడు.

ఈ ఫొటోలో షారుక్ బ్లాక్ టీషర్ట్, బ్లూ డెనిమ్స్ లో కనిపించగా.. బెక్‌హామ్ టీషర్ట్, బ్లేజర్ లో పార్టీకి వచ్చాడు. ఈ ఫుట్‌బాల్ లెజెండ్ కోసమే షారుక్ ప్రత్యేకంగా ఓ ప్రైవేట్ పార్టీని ఏర్పాటు చేశాడు. అతడు షారుక్ ఇల్లు మన్నత్ కు వస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ చూడటానికి తొలిసారి ఇండియా వచ్చాడు బెక్‌హామ్. మ్యాచ్ తర్వాత బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఏర్పాటు చేసిన పార్టీలో పలువురు సెలబ్రిటీలను కలిశాడు. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసిన టాలీవుడ్ నటుడు వెంకటేశ్ కూడా అతనితో సెల్ఫీ దిగి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ ను కలిసి అతడు ఇచ్చిన ఇండియన్ టీమ్ జెర్సీ వేసుకున్నాడు.

బెక్‌హామ్ ప్రస్తుతం యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ గా ఉన్నాడు. అదే హోదాలో ఇండియాకు వచ్చి మ్యాచ్ చూశాడు. 1996 నుంచి 2009 మధ్య ఇంగ్లండ్ తరఫున 100కుపైగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ఘనత అతనిది. మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, పీఎస్‌జీ, ఏసీ మిలన్ లాంటి క్లబ్స్ కూ ఆడాడు.

తదుపరి వ్యాసం