Venkatesh with Viv Richards: ఫ్యాన్‌బాయ్‌గా మారిపోయిన వెంకీ.. రిచర్డ్స్, బెక్‌హామ్‌లతో సెల్ఫీ-venkatesh selfie with viv richards and david beckham ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venkatesh With Viv Richards: ఫ్యాన్‌బాయ్‌గా మారిపోయిన వెంకీ.. రిచర్డ్స్, బెక్‌హామ్‌లతో సెల్ఫీ

Venkatesh with Viv Richards: ఫ్యాన్‌బాయ్‌గా మారిపోయిన వెంకీ.. రిచర్డ్స్, బెక్‌హామ్‌లతో సెల్ఫీ

Hari Prasad S HT Telugu
Nov 16, 2023 08:10 AM IST

Venkatesh with Viv Richards: టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా ఓ ఫ్యాన్ బాయ్ గా మారిపోయాడు. ఫుట్‌బాల్ లెజెండ్ డేవిడ్ బెక్‌హామ్, విండీస్ క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ లతో సెల్ఫీలు దిగి మురిసిపోయాడు.

స్టార్ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హామ్, విండీస్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ తో వెంకటేశ్
స్టార్ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హామ్, విండీస్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ తో వెంకటేశ్

Venkatesh with Viv Richards: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కూడా ఓ అభిమానిగా మారిపోయాడు. తన అభిమాన క్రీడాకారులతో సెల్ఫీలు దిగి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నాడు. బుధవారం (నవంబర్ 15) ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ చూడటానికి వచ్చిన ఇంగ్లండ్ మాజీ ఫుట్ బాలర్ డేవిడ్ బెక్‌హామ్, విండీస్ క్రికెట్ లెజెండ్ వివ్ రిచర్డ్స్ లతో అతడు ఫొటోలు దిగాడు.

ఈ సెమీఫైనల్ మ్యాచ్ చూడటానికి వెంకటేశ్ కూడా ముంబై వెళ్లాడు. తన అన్న, ప్రొడ్యూసర్ సురేశ్ బాబుతో కలిసి అతడు ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ చూశాడు. ఈ సందర్భంగా అక్కడ కనిపించిన వివ్ రిచర్డ్స్ తో మొదట అతడు సెల్ఫీ దిగాడు. దీనిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. "ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో లెజెండరీ వివ్ రిచర్డ్స్ ని కలవడం చాలా సంతోషంగా ఉంది" అనే క్యాప్షన్ తో వెంకీ ఈ ఫొటో పోస్ట్ చేశాడు.

ఇక తర్వాత కాసేపటికి డేవిడ్ బెక్‌హామ్ తోనూ వెంకీ మరో సెల్ఫీ దిగాడు. ఈ ఫొటోను స్టోరీలో షేర్ చేస్తూ.. "గ్రేట్ ఇన్నింగ్స్ చూడటానికి గ్రేట్ కంపెనీ దొరికింది" అంటూ డేవిడ్ బెక్‌హామ్ ను ట్యాగ్ చేశాడు. ఈ సెమీఫైనల్ మ్యాచ్ చూడటానికి ఎంతో మంది సెలబ్రిటీలు ముంబైలోని వాంఖడే స్టేడియానికి తరలి వచ్చారు. టాలీవుడ్, బాలీవుడ్, స్పోర్ట్స్ ప్రముఖులు వచ్చారు.

ఈ అందరితోపాటు వేలాది ప్రేక్షకుల ముందు టీమిండియా చరిత్రాత్మక విజయంతో ఫైనల్లో అడుగుపెట్టింది. విరాట్ కోహ్లి 50వ వన్డే సెంచరీ, షమి 7 వికెట్లు ఈ సెమీఫైనల్లో హైలైట్ గా నిలిచాయి. ఇక అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ కు టీమిండియా సిద్ధమైంది. గురువారం (నవంబర్ 16) ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరగబోయే రెండో సెమీఫైనల్ విజేతతో ఇండియా ఫైనల్లో తలపడనుంది.

IPL_Entry_Point