Ram Charan Diwali Party: రామ్‍చరణ్ ఇంట్లో మహేశ్, ఎన్టీఆర్, వెంకటేశ్: ఒకే ఫ్రేమ్‍లో స్టార్ హీరోలు.. వైరల్ అవుతున్న ఫొటోలు-ram charan hosts diwali party ntr mahesh babu and venkatesh attended ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ram Charan Hosts Diwali Party Ntr Mahesh Babu And Venkatesh Attended

Ram Charan Diwali Party: రామ్‍చరణ్ ఇంట్లో మహేశ్, ఎన్టీఆర్, వెంకటేశ్: ఒకే ఫ్రేమ్‍లో స్టార్ హీరోలు.. వైరల్ అవుతున్న ఫొటోలు

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 12, 2023 02:21 PM IST

Ram Charan Diwali Party: మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ తేజ్.. దీపావళి పార్టీ ఇచ్చారు. దీనికి కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

ఎన్టీఆర్, వెంకటేశ్, రామ్‍చరణ్, మహేశ్ బాబు
ఎన్టీఆర్, వెంకటేశ్, రామ్‍చరణ్, మహేశ్ బాబు

Ram Charan Diwali Party: మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్, ఆయన భార్య ఉపాసన.. తమ ఇంట్లో దీపావళి సందర్భంగా పార్టీ నిర్వహించారు. టాలీవుడ్ స్టార్లు ఈ సెలెబ్రేషన్లకు హాజరయ్యారు. కొందరు హీరోలు కుటుంబ సమేతంగా వచ్చారు. స్టార్ హీరోల రాకతో పార్టీ గ్రాండ్‍గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చాయి.

ట్రెండింగ్ వార్తలు

రామ్‍చరణ్ ఇచ్చిన దీపావళి పార్టీకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ఆయన భార్య ప్రణతి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్, విక్టరీ వెంకటేశ్ హాజరయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహరెడ్డి కూడా ఈ పార్టీకి వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు నమ్రతా శిరోద్కర్. తమకు ఆతిథ్యమిచ్చిన రామ్‍చరణ్, ఉపాసనకు థ్యాంక్స్ చెబుతూ క్యాప్షన్ పెట్టారు.

రామ్‍చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, వెంకటేశ్ కలిసి దిగిన ఓ ఫొటోను నమ్రతా పోస్ట్ చేశారు. ఓ ఫ్రేమ్‍లో స్టార్ హీరోలు ఉండటంతో అభిమానులు చాలా సంతోషపడుతున్నారు. ఇది కదా అసలైన దీపావళి పండగ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోనే పండుగలా ఉందని రాసుకొస్తున్నారు. ఈ ఫొటో చూడముచ్చటగా ఉందంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

ఉపాసన, నమ్రత, ప్రణతి, అల్లు స్నేహారెడ్డి కూడా కలిసి ఫొటోలు దిగారు. స్టార్ల సందడితో రామ్‍చరణ్ ఇంట్లో దీపావళి పార్టీ గ్రాండ్‍గా జరిగింది.

సినిమాల విషయానికి వస్తే రామ్‍చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు.. గుంటూరు కారం చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. వెంకటేశ్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నలుగురు హీరోలు ప్రస్తుతం తమతమ సినిమా షూటింగ్‍ల్లో బిజీగా ఉంటున్నారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.